24, సెప్టెంబర్ 2018, సోమవారం

*బస్తీ లో బతుకు బండి *




సోమవారం ఐదవ తేదీ 
పాగరపనీ పడేరొజు 

పాత చొక్కా ఇస్తీరి చేసి 
పైపైన సెంట్ చల్లి 

గరీబీ తనానికి గంధం  పుాసి 

బస్ లో ఆఫీస్ కు బయలుదేరేన బస్తీ జీవి 

నెల కొచ్చె జీతం చాలక 
జీవితంలో  సతమతమావిక 

కష్టని కడుపు లో దాచి 
అమ్మ నాన్న ల ఊరిలొ విడిచి 
చిన్ననాటి దొస్తులను విడిచి 
చదివిన చదువుల సామర్థ్యం లేక

బస్తీలొ బతుకు సాగేన పల్లె జీవి 

నేల విడిచిన సాము వలె
కల చెదిరెన కధ మారెన
 
ఉరుకుల పరుగుల
బస్తీ జీవనం లో 

వచ్చిన జీతంతో బస్తీ వదలకపోవున 

ధనవంతులతొ పొటీ పడకనే 
నౌకరు జీతంతో నటిస్తూ

బస్తీ లో బతుకు బండి"లాగుతున్నాడు 

మీ. వెన

20, సెప్టెంబర్ 2018, గురువారం

నేను


భూమికి చినుకే బిడ్డయైతే 
వాన రాక కొసం ఎదురుచుాడదా
నీ కోసం "నేను" ఐతే నీలో ఆహం పెరిగేన 
కనిపంచేదంతా మిధ్య 
అనుకుంటే కోర్కెల గుర్రం ఆగున 
శమజీవికి దరిద్రం చెల్లెలుగా వెంటుడున 
అబద్దం ఆటలతొ జీవనమే సాగున 
మరుగున పడిన విషయాలు 
మధనంలోంచి బుర్రకేకి
ఆధొగతిలొ పడవేయదా 
చీకటిలాంటి కోపంతో పగతొ రగిలేవ 


యాదమ్మ -కల *


పూర్వం దుప్పెల్లి అనే గ్రామములో  చెరువు కట్ట పనులు జరుగుతున్నాయి .ఊరి దొరగారు పనులు చుసుకొవడనికి రంగయ్య అనే చదువు కున మనిషి నియమించాడు. 
రంగయ్య కట్ట పనులకొసం బస్తీ నుండి మనుషులను తొడు కొచ్చాడు. 

వారిలో యాదమ్మ అనే యుక్త వయసు గల అమ్మాయి వారి తాతతొ కలిసి వచ్చింది. 

తాతతొ యాదమ్మ ఇలా. ...
తాత అబద్దం ఆడని మనుషులుంటార 

వుండరు తల్లి .

తాత మరణం తప్పదని తెలిసిన మనుషుల ఆశ చావదు కాదు 

ఆవునమా. 

తాత యాదమ్మని. ...
ఈ నీతి సూత్రాలు మన కడుపు నీంపావు తల్లి .

నీ పెండ్లి చెసి ఒక ్అయ్య  చెత్తిలొపెట్టి 
నేను కన్ను ముస్త తల్లి. 

ఎప్పుడు నాపెండ్లి గురించి దిగులు పడుతావ్ తాత ఎందుకు?

చుాడు తల్లి. ....

పుట్టినప్పుడు అందరు నవ్వుతారు అది నీవు  గమనించిలేవు 
చచ్చినపుడు అందరూ ఏడుస్తారు అది నీవు చుాడలేవు నీకంటు ఆనందం పొందేది పెళ్ళి ఒకటే తల్లి. .....

మధ్యలో వెంకన్న కలుగజేస్తూకొని నిజమే తాత. 
కాని తెలంగాణా దేవుడు  యాదగిరి నృసింహ స్వామి వరాలతొ పుట్టింది యాదమ్మ ఏమి బాధ పడకు తాత 
అంతా మంచే జరుగుతుంది. 

కాలం కలసిరాదు ఆగదు కుడా కాలంతో నీపయనం. 
***********
కట్ట పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి పేందలాడే దొర గారు వచ్చి చుసి పొయారు. 

తొర్ర చింత కాడ వంట 
తొట్ల వుండడం. ..
......
ఇది అంతా గమనించినా దొర. ...
తాత నీవు ఈవయసు లో కుడా కష్ట పడడం ఏమిటీ.

దానికి తాత ఎంతో భాధతొ ఇలా ుఅన్నాడు 

్అయ్య మాది బస్తీకి దగ్గర వున్నా
 రామా పురం నాకు నలబై ఎకరాల మాగాణి వుండేది.నాకొడుకు కొడలు పనిమిద ఊరికి బయలుదేరారు బస్సు ప్రమాదంలో కాలం చేసారు. 

ఆస్తిులని కరిగి పొయ్యయ్ దానికనా  నా మనువడు రఘు చెసిన మెాసం గుండె తరుకు పోతుంది. ...

దొర. ...
తాత నీకు మనువడు కుడావుండ. ..

ఆ.... దొర 
వాలా అమ్మ నాన్న పొయాక రఘు వున్నా పొలం ఆమ్ముకొని డాక్టర్ చదువు చదువుతానని ఆమెరికా పొయే తిరిగి రాడయే. 

యాదమ్మ  తన తమ్ముడు వస్తాడు ఊరిలొ అమ్మ నాన్న
పేరు మీద దవఖాన పెడు తాడాని కలలు కంటుంది.

"గడ్డివాములొ సుాది పడవేసి వెతికినాట్లయే మా బతుకులు అని తాత వాపోయారు. 

మీ వెన. ......

గుడ్ మార్నింగ్

🌄 🌅

ఆకు మీద మంచు బిందు ఆగనంటుంది

గుాడులొని పక్షి పిల్ల గురక విడి నానది

గడ్డి చామంతి పువ్వు లేమే తల గగనం పై చూస్తున్నవి

పొద్దుతిరుగుడు పువ్వు లేమే ముద్దు కొసం చూస్తున్నవి

నీటి లొని చేప పిల్ల నాట్యం చేస్తున్నది

ఉషొదయం కావాలన్నది

అని తెలిసిన మనిషిమెు
పది గంటలకు లేస్తా నంటాడు
గుడ్ మార్నింగ్ చెప్త నంటాడు.
Attachments area

18, సెప్టెంబర్ 2018, మంగళవారం

కులగజ్జి

అంతెేలే పేదలు
నాడు నేడు బలైతునా   మనుషులు

కులం పేరుతో మతం పేరుతో
మానవత్వం మరిచి

బలిసిన నాలంచ కొడుకులు

వేట కొడవలి తొ చంపడమా

అంతెేలే పేదలు రాజకీయ చదరంగం పావులు

.ఇంకాన ఇకపై సాగదు
కులమతా వర్గ పొరు

మాదిగ మాల మనుషులుకార

చదివిన చదువులు మట్టి గొడలకే పరిమితమా

ఇంకాన ఇకపై సాగునా
పేదల పై బలిసిన వాడి పెత్తనం

.రాజకీయ రంగు
Tv...TRP హంగు

సిగ్గులేని జనం కులం పేరుతో చచ్చే మూర్ఖలు

కడుపుతొ వున్నాదాని
కనికరం లేని కసాయి వాలం

రాజకీయ స్మశానం లో నేటికీ కాలుతోంది కుల శవం

Velmajala Narsimha

15, సెప్టెంబర్ 2018, శనివారం

మొబైల్ జీవితం*



నిలచివుంటె చేతిలో 
నడుస్తుంటే జేబులో 

పడుకుంటే పక్కలొ 
ఒంటరిగావుంటే గేమ్స్ తొ

సమయంవుంటే చాటింగ్ తొ 
రోజంతా బాత్ఖనీ తొ

నీవులేని జీవితం నిమిషామైన శున్యం

పొద్దున్నే నీ ముఖం చుస్తు లేస్తాం 

రాత్రిదాక నీను చుస్తుంటే నిద్ర రాక చస్తాం

ఎక్కడవున పక్కనే నీవు 
మనిషికి మనిషికి  మాటలేవ్ 

కర్ణ పిశాచమా కాలం నీదే సుమా 
దృశ్య పిశాచమా జగత్త్ నువ్వే సుమా 

మీ వెన. .....

14, సెప్టెంబర్ 2018, శుక్రవారం

వక్రతుండ వన్స్ మెుర్***

*

దుప్పెల్లి అనే  గ్రామములో గణేష్ తన మామ రాము 
ఇంటికి వినాయక చవితిని పురస్కరించుకొని వస్తున్నాడు.

...మామ ...మామ. ..గణేష్ అని  వినాయకుడాని ఎందుకంటారు.

మామ నవ్వి నీ లైట్ వెలిగినటుందిరొయ్.

మీ అమ్మ నన్ను తమ్ముడు లేదా చిన్న అని పిలుస్తుంది .

గణేష్డు కి వక్రతుండ అని
గజణాన ,ఏకాదంతయాని పిలుస్తారు .పేరులో ఏమిలేదు 
అల్లుడు మంచితనం వుంటే చాలు.

బైక్ పచ్చని పొలాల మధ్య లొ పిల్ల బాటల గుండా వెేడుతుంది.

చుట్టూ పక్క ల గ్రామములలో భజన పాటలు వినసొంపుగా వినబడుతున్నయ్

గణేష్ బైక్ పై కూర్చొని అటు ఇటు వుగుతునాడు.

దాని గమనించినా మామ. ....

గణేష్ కదలకుండా కుర్చొ నేను నీకు కధ చెబుతాను.
హ.... అనాట్టు  తల ఊపడు. .....


అనగానగ బెజ్జలదేశాని మార్జాల రాజు పరిపాలిస్తున్నాడు కాని
ముాషిక  ప్రజలేకువా. మార్జాల రాజు ముాషిక
ప్రజలను చాలా భాధలు పెడుతుండెవాడు.

మా కొసం మాదేవుడు వస్తాడాని ముాషిక  జనం వేచి చుాస్తునారు.

సంవత్సరం గడిచింది వినాయక చవితి రానే వచ్చింది.

ముాషిక  ప్రజల కొసం గణపతి బప్పా ఎలుక వాహనం పై
 వచ్చి మార్జాల రాజు పై దండెత్తి
ముాషిక  ప్రజలు చూస్తుండగా మార్జాల రాజు పై యుద్ధం చేస్తూంటే. .
...ప్రజలు వక్రతుండ  వన్స్ మెుర్
వక్రతుండ వన్స్ మెుర్
కేకలు వేస్తూనారు.

యుద్ధంలొ గణపతి బప్పా మార్జాలరాజును ఒడించాడు.

అప్పుడి నుండి పతి సంవత్సరం బెజ్జలదేశా
ప్రజలు వినాయక చవితి ఘనంగా  జరుపుకొంటునారు
అని చెప్పాగ.

గణేష్. ...మామతొ. మామ కధ వన్స్ మెుర్ గా వుంది.

వక్రతుండ వన్స్ మెుర్ అని అరుస్తూండగానే ఇల్లు వచ్చింది.






11, సెప్టెంబర్ 2018, మంగళవారం

ఒకనొక సాయంత్రం. *



అప్పుడే పుట్టిన పక్షి పిల్ల అరుపులు 

ఆ చొట్టుకు వచ్చిన చలని గాలికి చెట్టు విరుపులు 

కాయలతొ వంగిన కొమ్మ లు

గడ్డి లో గొల్లభామల గోల లు

రంగు రంగుల పశువులు

 దుారంత వినపడే వరి నాట్ల పాటలు 

కందిచేను వయ్యారాలు
పెసర చేను పిలుపులు 

 ఒకనొక సాయంత్రం పల్లె తల్లి చెంత. ....

8, సెప్టెంబర్ 2018, శనివారం

*రాజకీయ బానిస*



అంతేలే మన మధ్య జనం 

రాజకీయ పార్టీల గొర్రెలు బర్రెలు 

వాళ్లు పోసే మద్యానికి, డబ్బుల బానిసలు 

నిప్పేనా నివురుగప్పిన నిప్పేనా

మాటల చేతలకు అర్దం లేని రాజకీయ నేతేనా 

మారదు సమాజం మన వెర్రితనం

డబ్బులదే పెత్తనం దొరలదే రాజకీయం

డిల్లీ నుండి ఘల్లీ దాకా 
డబ్బున  వాడిదే రాజకీయం

నేహు నుండి ఇప్పటి ఘల్లీ నేతవరకు
డబ్బులదే రాజకీయం 

కుక్కలు ముతి నాకడం వరకు తాగడం 
ఐదు ఏండ్ల బానిస కావడం 

సిగ్గులేని జనం రాజకీయ ప్రయోజనం 

తరం మారిన యువతరం వచ్చిన

 కట్టుబానిస బతుకే మన పల్లెల జనం 

రాజకీయ బుట్టలలొ చేపలం 

మారదు సమాజం మన వెర్రితనం

****వెన. ....

5, సెప్టెంబర్ 2018, బుధవారం

ముంబయి మహా నగరం

 

వరి పండదు ఈనేల పై
వంకర కాలువలు ఎన్నో 

నీరు వుంటుంది ఘనముగా 
లవణం మరెంతొ 

ల్లీ ల్లీ గట్టెరు 
వైతరణి పారే జోరు 

కంపు కొట్టే కాలువలు 
కనిపించని జామీను 

మహా మహా నగరం 
ముంబై నగరం 

పంకజం లో తామరలాగ
 కష్టజీవికి కాసులానే 

కష్టం దొచే సేఠ్ లేందరే

తళ తళ మెరిసే భవనాలు
తప్పటగుల జీవితాలు 

వైతరణీ పక్క వంటశాకం
 మహా సముద్రాల ముంబై నగరం 

మొబైల్ లేని మనిషి వుండడు 
సమయమే వుండదు 

ఉరుకుల పరుగుల జీవితం 
నెల జీతం పై బతుకే మనుషులం 

అందమైన భవనాలు
 అంతేలేని జనసాంద్రం 

బలిసిన దొరలు కొందరు 
బతుకు దెరువుకోసం ఎందరొ 
మహా మహా నగరం 
మనుషుల కోసం
 ముంబయి నగరం 



మీ ..వెలుమజాల ... నరసంహ

3, సెప్టెంబర్ 2018, సోమవారం

కృష్ణాష్టమి

అది హిమాలయ పర్వత పచ్చని దేవదారువృక్షలు వుండే చోటు అక్కడికి వచ్చే పర్యాటకులకు వెచ్చని టీ కాపీలమే గుడిసె.

గుడిసెలో ఒక నిండు చులాలు పురుటి నొప్పులతొ వుంది. రామకాంత్, లక్ష్మి లకు ఏడుగురు ఆడ పిల్లలు.ఎనిమిదివ సంతానం మగ పిల్లడైన
వస్తాడాని రమకాంత్ లక్ష్మి ల ఆశ.

"ఆశ మనిషికి బతుకు నిస్తుంది."

పిల్లలు చెర్రి పండ్లను తింటూ గుడిసె ముందర ఆడుకుంటున్నారు.

అది అష్టమి రొజు వాతావరణం చాలా వెచ్చని గాలులు వీస్తున్నాయి
 .దేవదారువృక్షలనుండి
సువాసనలు వెదచలుతు నాయి.

ఉదయం 10గంటలకు లక్ష్మి పండటి ఆడ బిడ్డకు జన్మ నిచ్చింది. అచ్చం మగ రుాపంలొ వుంది పాప. 

అది గమనించినా రమకాంత్ ఆ పాపను తీసుకోని ఒక దేవదారు చెట్టు కింద వదలి పొయాడు .

కొంత సేపటి తరువాత బిడ్డ ఏడవడం మెుదలు పెట్టింది. 

తెలుగువాడైన అచుత రావు తన బార్య తొ హిమాలయ పర్యటనకు వచ్చాడు. 

ఈపాప ఏడుపు శబ్ధం వినిపించింది. 

శబ్ధం విని వచ్చినా అచుత రావు కు దేవదారువృక్షం కింద పాప దేవతా వలె కనిపించింది. 

అచుత్ రావు ఎత్తుకొని తన బార్యతొ ఇలా అన్నాడు కృష్ణాష్టమినాడు దొరికింది కాబట్టి కృష్ణవేణీ పేరు పెట్టి 
పెంచుకుందం కూతురు  లేని మనకు వైష్ణవి దేవికరుణించిందాని తీసుకుపోయడు. 

కృష్ణవేణీ పెరిగి పెద్దదై చదువుతొబాటు బాణా విద్యలో మంచి ిప్రవిణాత సంపాదించి 

అలా కొని రోజులు గడిచినా తరువాత అచుత రావు తన కుటుంబం తొ హిమాలయకు విహర యాత్రకు వేలాడు 

కృష్ణాష్టమి రోజు  అదే దేవదారువృక్షం చూడ గానే అచుత రావుకు కృష్ణవేణీ దొరికిన విషయం రమకాంత్ టీ గుడిసెకడ చెప్పాడు. 

రమకాంత్ తన ఏనిమిదొవ కుతురిని దేవదారువృక్షం కింద వదిలిన విషయం గుర్తుకు వస్తుంది. 

ఏదైనా నా కూతురు మంచి ఉన్నత కుటుంబంలో జీవిస్తోందా నుగొన్నాడు. 

కృష్ణాష్టమిరోజు పుట్టింది మా కృష్ణవేణీ

 హిమాలయలొ పుట్టి తెలుగు గడ్డ పై పెరుగుతుంది. 
అంతా కృష్ణలీల. ...


మా మల్లీగాడి పెళ్ళిగొల.



అప్పుడు మనం ఏడవ తరగతిలో విడిపోయం 
అమ్మమా ఊరిలొ ఎక్కువ రొజులంటే మా పెంట వంశానికి మచ్చ అనుకొంటి. చాలా రొజుల తరువాత నీ మొబైల్ నెంబర్ దొరికింది . నీకు వాట్సప్  చేస్తున్నారా...
ఇంకా మన చీముడీ ముక్కు శీనుగాడు, శంకర్ గాడు .బర్రెదూడ రవి గాడు మన దొస్తు లత బాగుంద  .
బాగానే వుంటారు ఎందుకంటే మీ పెండ్లిలు చేసుకోవచ్చు కదర. .
లతకు జరిగిన అవమానం తలుచుకుంటే బాదగ వుంటుంది. 
కాని శివగాడు చేసింది తలుచుకుంటే నవ్వుతూ
వుండలేక పోతున్నా ఇప్పటికీ. 

బర్రె కాడి కిట్టయ్య కొడుకు కుంటి కాలు యేల్లి గాడికి పెళ్ళం దొరికిందా రా. ..

అస్సలే బట్టతల ఆపై మేల్ల కన్ను దానికి తొడు పొట్ట వచ్చిందిరొయ్. 

కాని మన దొస్తులలొ నేనే అందంగా వుంట కదర. 
కాని నాకు ఇప్పటికీ పెళ్లి కాలేదు. ..

మీ పిల్ల లేమే బడికి పోబటే. ..రా...
నాకేమెు మరీ పెళ్లి కాలేదు. 
పేసుబుక్ లలొ లేదా వాట్సప్ లొ సటింగ్ చేస్తారటగా. 

నాకు గడ్డ ం కుాడ నెరిసింది కాని పిల్ల లేతగ తామరకుల వుండాలంటాను. 

వాట్సప్ లొ వుకే ముాతి పెట్టాక నాకు మంచి అంటే మంచి. .......పెళ్లాం చుడండి రా...మన దొస్తులకు చెప్పు.లేకుంటే శెర్ చేయ్ వుంటూను రొయ్ 
మీ మల్లీగాడు




29, ఆగస్టు 2018, బుధవారం

÷వరలక్ష్మి÷



1.ఎన్నో నొముల పుణ్యమా 
కనకడుపు మా బాగ్యమ్మ 
కొలిచిన దేవత కరుణించె 
మాఇంట జన్మనిచ్చినది  వరలక్ష్మి 

2.పుాజలు చేయగా పుట్టిందని 
వరాలు కొరగ వచ్చిందని
 ఇద్దరు అన్నల ముద్దుల చెల్లి
పుత్తడిబొమ్మ  వరలక్ష్మి 

3.కలువ కనుల అందం చుాసి 
విరజాజి ముఖ గంధం  పుాసి 
ముచ్చట పడేన మా ఇల్లు 
 చక్కని చుక్క వరలక్ష్మి 

4.ఎదుగుతనె బలపం విడి 
కంప్యూటర్తొ చదువులు నేర్చి 
టకటక మని లెక్కలు చెప్పినా 
చదువుల తల్లి వరలక్ష్మి 

5.ఇంటర్ వరకు వచ్చెన్  చదువు

పరికిణీ పండుగ చెసిరి ఘనముగ 
రేపే  పయనం పట్నం చదువుకు 
పడే ఆలొచనలొ వరలక్ష్మి 

6. హస్టల్ చేరేను  మరుసటి రొజు 

మదిలో ఎదొ కలతచెందేను

గదిలో చుని ్న ఉరి తాడై 

గగనాన్నికేగేసెన వరలక్ష్మి

మీ వెన. ....

నాపల్లె అందం

🌾 🌾


1.పచ్చటాకు పాడి ఆవు గొర్రెమంద గొల్లబామ్మ 


లేత చిగురు వగరుకాయ వాగు సొగసు
 చేప పులుసు

తుంగ దిబ్బ తుటి కుార 
గిజిగాడు
గండు తుమ్మెద 

నాపల్లె అందం చుాడతరమా  


2.చెరువు కట్ట 
తాత్త నొట్లొ చుాట్ట

సజ్జ చేను సాలె గుడు 
జొడి యేద్దు జొన్న చేను
 నాపల్లె అందం చుాడతరమా


3.ఈతకల్లు తాటి వనం 
రేగు పళ్లు రావిచెట్టు 

ఈత బావి రేల పువ్వు
నాపల్లె అందం చుాడతరమా

4.పచ్చని చేను పల్లె యాస 
కొడి కుాత కొరమీను 
ఊట చెలిమె ఉరగాయ

 నాపల్లె అందం చుాడతరమా

5.తాటి కల్లు 
తొడు చుట్టం 
కంచే రేగు కందికాయ 

వరుసలతో పిలుపు 
సరసమైన మనుషులు
 
నాపల్లె అందం చుాడతరమా

*** మీ వెన. .. Duppally

27, ఆగస్టు 2018, సోమవారం

*రక్షాబంధన్*



భగవంతుడు లేడు అనే వాడికి బలమైన సమాధానం 

బంధం బలమైనది అనడానికి నిలువెత్తు నిదర్శనం 

కన్న పేగు నుండి కాటిీ వరకు సాగే పయనం లొ 

అన్న చెల్ల ల అనుబంధం అజరామం 

అన్న తమ్ముడు బంధం నాభి నాలుక బంధం 

బంధలు ఎన్నో పండగ లు అని...

కానీ "రక్షాబంధన్ " అన్న చెల్లల రక్షణ అవసర బంధం

23, ఆగస్టు 2018, గురువారం

*ననంద. (నా మిత్రమా)




రేపల్లె లొ సందడిగా పండగ వాతావరణం వుంది, వర్ష లు పడడంతో  గొవర్థనగిరి పచ్చగా ఆకాశానికి రంగు వెసినటు కనిపిస్తుంది. 

 ననంద తన చద్ది ముాట భుజంకు వేసుకొని గొవులను గొవర్థనగిరికి  తొలుక పోవడానికి సిద్ధమయ్యాడు. తన కన్న చిన్నదైన  లతంగి 
నేను నీతో గొవర్థనగిరికి  వస్తానని మారాం చేస్తుంది.

వటపత్ర మరియు కుశంక తయారై 
కిట్టయ్య కోసం చుస్తునారు.

చేతిలో పిల్లనగ్రోవి మరొ చేతికి బంగారు కడియము తొ గోవుల ముందర  కిట్టయ్య నడుస్తున్నాడు. వారి వెనుక తక్కిన గోవులు ,ననంద మరియు గోపా బాలురు గొవర్థనగిరికి  వచ్చారు. 

ఎప్పుటి లాగే కిట్టయ్య గోవుల చుట్టూ కర్ర తొ గీతగీసి ఒక చెట్టు కింద కూర్చొని పిల్లనగ్రోవితొ వినసొంపుగా పాట పడుతుంటే గోవులు గీత లొపలుండి నేమరు వేస్తున్నాయి. కిట్టయ్య కు ఇష్టమైన ఆవు ,గొలక్ష్మి తన దుడేకు పాలు ఇస్తుంది.

తక్కిన గొపబాలులు మంద ముందర వుండే ఎండకు నిలబడి మేపు తున్నారు.

అలా కొని రోజులు గడిచాయి 

పతి దినం రావడం గొవుల చుట్టూ కర్ర తొ గీత గీయటం వేణువు తొ పాటలు పడడం గమనించినా ననంద. 

తన మంద చుట్టూ ననంద కర్ర తొ గీతగీసిన ఆవులు చిందరవందర పోతున్నాయి  .

కృష్ణుడి గీసిన కర్ర లతో గీసిన గోవులు గుంపుగా వుండడం లేదు. 
కొని రోజులు పాటు కర్ర లను జమచేసి వాటితో ననంద ఇంకా గోపా బాలురు తమ గొవుల చుట్టూ గీత గీసిన అవి చిందరవందరగా పోతున్నాయి. 

ననంద మరియు గోపా బాలురు అందరు  కృష్ణుడిని ఇలా అడిగారు
నీవు గీసిన గీత దాటడం లేదు కానీ మేము ఎన్నో సార్ల గీసిన వుండడం లేదు యేందుకని.


దానికి కిట్టయ్య మందహాసం తొ చిరునవ్వు నవ్వి 
చుాడు "ననంద నా మిత్రమా "పతి జీవికీ దేనికదే ప్రత్యేకం. 
ఇతరులను అనుకరించడం వారిలా  జీవించడం ఆసాద్యం 
ఇదే దుఃఖం కు కారణం. 
నీవు నీలాగే జీవించి చుాడు ఎంతో ఆనందం అని కిట్టయ్య చెప్పాడు. 

గొధుళీ వెలాయే యని గొవులతొ గోపా బాలురు ఇంటికి చేరారు. 
*****

మీ వెన...

Duppalli


21, ఆగస్టు 2018, మంగళవారం

కొంటే కొణంగి



జలజ తన భర్త తొ అమ్మగారింటికి సైకిల్ పై పోతుంది .
ఊరి చివర గొర్రెల మంద ఎదురొచింది 

జలజ: ఎవండి మీరు ఊరేలుతునరాని మీ అక్క చెల్లెలు  ఏదురు వస్తున్నారు 

జలజ అమ్మగారి ఊరి వచ్చింది. 

రెండు పందులు ఎదురొచినవి 
జలజ భర్త: జలజ మీ అన్న,తమ్ముడు నీ రాక కోసమే చుస్తునారు 
సైకిల్ దిగు. ..

18, ఆగస్టు 2018, శనివారం

మల్లీ బావి కంచెలొ ఆట.(Song-8) Duppelli Village


పల్లవి:మల్లీ బావి కంచెలొ ఆట. ...

మసీదు బండ పై పాట. ..
ఊరంతా గుమిగూడె చోట. ..
మాఊర్లొ బతుకమ్మ ఆట. ..


చరణం:గునుగు పువ్వుల బాట ..
తంగెడు పువ్వుల వేట. ..

తమ్ముడు శీను పాట 
తగిలే చలి ఉదయం పుాట. ..

                :మల్లీబావి:

చరణం: మసీదు బండ పై పాట. .
మదిదొచ్చెన్ ఊరి జనం నోట. .

ఊరి ఆడపడుచుల బతుకమ్మ ఆట 
తెలంగాణ తల్లి దీవెన ముాట. ...

                 :మల్లీబావి:

16, ఆగస్టు 2018, గురువారం

వందేమాతరం  చంద్రయ్య 🇮🇳

అనుకున్నవి అని జరగక, అనుకొనివి జరగడం వాటివల్ల సంతోషంతో  పాటు పేరు మారటం సహజంగా చుస్తుంటం. అలాంటి చిన్న సంఘటనే  ఈ కధ. ..

దుప్పెల్లి అనే గ్రామములో వడ్డెర పెంటయ్య దుర్గ మ్మ  కొడుకు చంద్రయ్య.మసీదు బండ వారి జీవనాధారం . బండలపై కడీలు,ఇంటి  రాళ్ళు పనులు  అదే లోకం. 
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

స్వాతంత్ర్య ఉద్యమ సయమం భగత్ సింగ్ ఉరి తొ, ఊరి ఊరులలొ యువతలలొ స్వాతంత్ర్య కాంక్ష  బలపడుతుంది .
నేతానలు ముాడు రంగుల జెండాలను ఉచితంగా ఊరంత పంచారు. 

వీధి ముల్ల లో జెండాలను పాతారు వందేమాతరం తొ ఊరంత దద్దరింలింది. 
కుల మత భేదాలు లేకుండ వందేమాతరం మరుమెుగింది. 
దానికి కోపించిన ఆంగ్లేయులపోలీసులు  పాతిన జెండాలను పికి మసీదు బండ పై తగులపెట్టాడానికి చుస్తుండగా గమనించిన వడ్డెర చంద్రయ్య
 పక్కనున్ను తన గూడెం మనుషులను తీసుకోచి ఆంగ్లేయులపోలీసులపై
దాడికి దిగారు. వడ్డెర జాతి దెబ్బ కు తట్టుకోలేక జెండాలను విడిచి పారిపోయారు. 
జెండాలను తీసుకోని చంద్రయ్యవారి గుండెం లో పతి గుడిసె ముందర జెండాలను పాతారు.ఈ విషయం తెలిసిన ఊరు జనం వడ్డెర చంద్రయ్య ను వారి దైర్యం కు 
మేచ్చి  వందేమాతరం చంద్రయ్య గా పిలుచుకున్న రు.

వందేమాతరం



వంద గొంతుకల నినాదం  వందేమాతరం 

ఎన్నో గొంతుల బలిదానం స్వాతంత్రం  

రాజకీయ చదరంగం నాడు వుంది నేడు వుంది

 బలైపోతున మధ్యతరగతి మనుషులు ఎప్పుడూ మేకలే. ....

ఇంట్లో తిండికి వుండదు చేతితో డిజిటల్ పోన్ 

చదవడానికి ఎన్నో వసతులు చదివే పిల్లలేరు

పచ్చాతి సంస్కృతి పడేసేన్ నిన్ను పాతాళానికి 

స్వాతంత్రంి అంటే నేట్ లో వెతికి సంబార పడుతుంది నేటి యువత 

వందేమాతరంటే అలసట అనుకొని వదిలేసిన నేటి యువత.
మీ వెన. ..

13, ఆగస్టు 2018, సోమవారం

*గడ్డి చామంతి *



 పూర్వం  దుప్పెల్లి అనే గ్రామములో ఊరి కరణం అమ్మాయే " జయంతి ఊరిలొ పదవ తరగతి చదివిన మెుదటి అమ్మాయి .చక్కటి ముఖచాయ, లంగా ఒణీ తొ వీధులలొ తిరుగుతూ వుంటే కుందనపు బొమ్మల వుంటుంది  ,మంచి గొంతు అందరితొ కలగలుపు మనిషి.  
******

పతి సంవత్సరంలాగే ఈసంవత్సరం దసరా సంబరాలు మెుదలైనవి పల్లెలకు దసరా వస్తుందంటే చాలు పచ్చని పైరులతొ భుామాతకు పచ్చని 
కొ త్త చీర కట్టినట్లుగా వుంటుంది. సద్దుల బతుకమ్మ మెుదలు పది రొజులు పండుగే. 
రొజు గడ్డిీ ముందర విశాలమైన పాుగణంలొ బతుకమ్మ ఆడేవారు  .
*****
కానీ ఈసంవత్సరం ఇంతవరకు వర్ష ం పడింది లేదు రైతు లలొ ఆందోళన, వేసిన పంటలు నీరు లేక విలవిలాడుతున్నాయి. 
బతుకమ్మ ఆట చివరిరోజు వాన కోసం ఊరి జనం పుాజ చేస్తున్నారు. అందులో ఒకా ముసలి ఆమెకు పుానకం వచ్చింది. 

****
ఈసంవత్సరం ఇంతవరకు వర్షాలు కురవకపొవడానికి కారణం వయసు వచ్చినా అమ్మాయి ఇంకా (రజస్వల)పుష్ప‌వ‌తి కాలేదు అలాంటి అమ్మాయి నాను తాకింది నిరుడు, అప్పటి నుండి నేను కొపించాను.పొయిన  సంవత్సరం పుాజ చేసింది జయంతి నే జనం ఒకటే గుసగుసలాడుతునారు 
.పుష్ప‌వ‌తి కానిది జయంతి నే. 
"సమస్యను సమస్యగా  తలిచేవాడు మనిషి, దాని పరిష్కారం వెతికేవాడు గొప్ప  మనిషి"
జయంతి కృంగిపోలేదు. చదువుకున్న అమ్మాయి. తనకు తెలుసు అవి ముాడనమ్మాకాలని. కొన్నింటికీ కాలమే సమాధానం చెప్పుతుంది.
*******
కొని రొజుల తరువాత బారిగ వర్షాలు వచ్చి జనం ఆనందతొ ఉన్నారు. గడ్డిీ గోడపై గడ్డి చామంతి పువ్వులు విరబుసినాయి .
 ..మీ...వెన. .

11, ఆగస్టు 2018, శనివారం

జోక్ 🤣-6



తరగతిలో పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు దాని గమనించినా టీచర్ తరగతిలోకి వెలాగానే ఎవరొ ఒకరు గబ్బర్ సింగ్ అన్నారు. 

టీచర్: నేను గబ్బర్ సింగ్ నే ..ఎవరి చదువు వాడు ఎవరి రాత వాడే రాయలి. ..ఇప్పటినుండి. .

జోక్. ..5


రాము వాలా అమ్మ నాన్న. ..ఒరేయ్ రాము నీకు వైఫ్(పిల్ల)ను చుడబొతునాము మంచిగా తయారై రా...

రాము :అమ్మ... వైఫ్ ఏమేగాని వై..ఫై. .ఉంటదా వారింట్లో. .

అమ్మ: 👻

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...