1, ఫిబ్రవరి 2017, బుధవారం

Narsimha Velumajala: నరసింహ

Narsimha Velumajala: నరసింహ: . తల్లిదండ్రులు భార్య – తనయు లాప్తులు బావ మఱదు లన్నలు మేన – మామగారు ఘనముగా బంధువుల్ – గల్గినప్పటికైన దాను దర్లగ వెంట – దగిలి రారు యముని...

28, డిసెంబర్ 2016, బుధవారం

తల్లిదండ్రులు భార్య – తనయు లాప్తులు యాయుష్య – మియ్యలేరు

.
 


 తల్లిదండ్రులు భార్య – తనయు లాప్తులు బావ
మఱదు లన్నలు మేన – మామగారు
ఘనముగా బంధువుల్ – గల్గినప్పటికైన
దాను దర్లగ వెంట – దగిలి రారు
యముని దూతలు ప్రాణ – మపగరించుక పోగ
మమతతో బోరాడి – మాన్పలేరు
బలగ మందఱు దుఃఖ – పడుట మాత్రమె కాని
యించుక యాయుష్య – మియ్యలేరు

తల్లిగర్భమునుండి – ధనము తే డెవ్వడు

 

   
సీ. తల్లిగర్భమునుండి – ధనము తే డెవ్వడు
వెళ్లిపోయెడినాడు – వెంటరాదు
లక్షాధికారైన – లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు – మ్రింగబోడు
విత్త మార్జనజేసి – విఱ్ఱవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము – తోడరాదు
పొందుగా మఱుగైన – భూమిలోపల బెట్టి
దానధర్మము లేక – దాచి దాచి
తే. తుదకు దొంగల కిత్తురో – దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా – తెరువరులకు?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...