30, ఆగస్టు 2017, బుధవారం

లక్ష్మినారసింహ








పాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార
లక్ష్మి నారసింహ లక్ష్మినారసింహ
ప్రళయ మారుత ఘోర భ్రస్తిక పుత్కర లలిత నిశ్వాస దోలారచనయా
కులశైల కుంభుని కుముదహిత రవిగగన
చలననిధి నిపుణ నిశ్చల నారసింహ నిశ్చల నారసింహ
దారుణోజ్వల ధగధ్ధగీత దంష్ఠానల వికార స్పులింగ సంగక్రిడయా
వైరి దానవీ ఘోర వంశ భస్మీకరణ
కారణ ప్రకట వెంకట నారసింహ
వెంకట నారసింహ వెంకట నారసింహ

1, ఫిబ్రవరి 2017, బుధవారం

Narsimha Velumajala: నరసింహ

Narsimha Velumajala: నరసింహ: . తల్లిదండ్రులు భార్య – తనయు లాప్తులు బావ మఱదు లన్నలు మేన – మామగారు ఘనముగా బంధువుల్ – గల్గినప్పటికైన దాను దర్లగ వెంట – దగిలి రారు యముని...

28, డిసెంబర్ 2016, బుధవారం

తల్లిదండ్రులు భార్య – తనయు లాప్తులు యాయుష్య – మియ్యలేరు

.
 


 తల్లిదండ్రులు భార్య – తనయు లాప్తులు బావ
మఱదు లన్నలు మేన – మామగారు
ఘనముగా బంధువుల్ – గల్గినప్పటికైన
దాను దర్లగ వెంట – దగిలి రారు
యముని దూతలు ప్రాణ – మపగరించుక పోగ
మమతతో బోరాడి – మాన్పలేరు
బలగ మందఱు దుఃఖ – పడుట మాత్రమె కాని
యించుక యాయుష్య – మియ్యలేరు

తల్లిగర్భమునుండి – ధనము తే డెవ్వడు

 

   
సీ. తల్లిగర్భమునుండి – ధనము తే డెవ్వడు
వెళ్లిపోయెడినాడు – వెంటరాదు
లక్షాధికారైన – లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు – మ్రింగబోడు
విత్త మార్జనజేసి – విఱ్ఱవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము – తోడరాదు
పొందుగా మఱుగైన – భూమిలోపల బెట్టి
దానధర్మము లేక – దాచి దాచి
తే. తుదకు దొంగల కిత్తురో – దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా – తెరువరులకు?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...