30, అక్టోబర్ 2018, మంగళవారం

కనిపేంచే దైవం మరిచి

కనిపేంచే దైవం మరిచి 
కాశీ కి పొతే  వచ్చేన పుణ్యం

కాలు నొప్పేడతవి అనుకుంటే చేరెవా గమ్యం

నొప్పి వస్తుంది అనుకుంటే నిచ్చేన శిశువుకి జననం 

తినకుండా మరియు ఇతరులను తిట్టకుండ వుండున మనిషి 

తలంపు లేని తలకాయ వుంటుంద లోకంలో 

చెట్టు, నదిలాగ బతకడం కష్టం కదా ఈ లోకంలో

అపా ్య యత అనురాగం నీసంపాదపై ఆధారపడున

చేదు వున్నంత మాత్రాన 
వేప యేమి చెడ్డ దా

మానవతా మనిషికి మంచి మార్గం చుాపునా


28, అక్టోబర్ 2018, ఆదివారం

చివరకు మిగిలేది.👳‍♂(Life of knowledge)


దుప్పల్లి  ఊరిలొ వెంకటయ్య అనే జాలరి నివసిస్తున్నాడు కొంచెం మంద బుద్ధి తనంతొ పాటు చిలిపితనం వుండేది. ఊరిలొ అందరిని ఆట పటిస్తూవుండేవాడు.

రొజు ముాసినదికి చేపల వేటకు వేళ్ళడం సాయంత్రం ఇంటికి వచ్చి సైకిల్ పై ఊరంతా తిరగడం చేసేవాడు.

తన తండ్రి కాలం చేసినా నాటికి రెండు సంవత్సరాల బాలుడు అంటాది తల్లి రాధమ్మ .

ఐనా తన వృత్తిని నమ్ము కొనవాడికి అన్నం కరువుండదాని రాధమ్మ గట్టిగా నమ్ముతుంది.

*****
ఈ యేడాది కాలం ముందుగానే వచ్చింది
వర్షాలు బాగా కురువడంతొ చెరువులు కుంటలు నిండుకున్నాయి ముాసినది యేరు పుాసి పారుతుంది.

ఎంతో ఉబలటంతొ వున్న వెంకటయ్య పెందలకడ చేపల వేటకు బయలుదేరాడు.

యేరు పుాసి పారుతుంది వెంకటయ్య ఆశతో ఈదుకుంటు ఆవతల ఒడ్డుకు పొయి గంపెడు చేపలు పట్టిండు.

చేపలను చుాసిన వెంకటయ్య కు ఆనందం వేసింది. అన్ని మంచి చేపలే ,కొర్రమట్టలు, బొచ్చలే .

ఈరోజు నుండి నా దశ తిరిగింది నేను చాలా ధనవంతుడౌవుతాను.
అనుకుంటు యేరు దాటాలి కదా అనుకొని తెరుకొనాడు.


యేరు దాటి ఇంటికి పోవాలంటే చాలా సమయం పడుతుంది
చేపలు చనిపోతే ధర ఎక్కువ రాదు.


వెంకటయ్య గంపలొ సగం వరకు నీళ్ళు పోసి దానిలో చేపలు వేసి తలపై పెట్టుకొని యేరు ఈద సాగాడు.

ఒకొక్క చేప నీళ్ళ లో దుాకుతున్నయ్.

నీటి బరువుకు,యేరు శబ్ధంకు గమనించని
వెంకటయ్య ఊరు ఒడ్డుకు వచ్చి చూస్తే నీళ్ళు తప్ప చేపలు లేవు.

"కష్ట పడుట ముఖ్యం కాదు వచ్చిన అవకాశాని ఎలా ఉపయోగించవు అన్నది ముఖ్యం.

"వెన. ....

26, అక్టోబర్ 2018, శుక్రవారం

జీవితం బండి ప్రయాణం



























జీవితం బండి ప్రజీవితం బండి ప్రయాణం వంటిది దారి మనమే చుాసుకొవాలి.

గుడ్ మార్నింగ్ " మిత్రమా

మాఇంటి కొడి మళ్ళీ కుసింది
సీతాలక్ష్మి చీపురు కలాపి తొ పని మెుదలెటింది
గురక వదులు అని నా మొబైల్ "
గుడ్ మార్నింగ్ " మిత్రమా  అని పిలుస్తుంది.

22, అక్టోబర్ 2018, సోమవారం

పల్లె బతుకులు!

పల్లె పాడవుతుంది పాత కక్షలతొ పార్టీ జెండాలతొ
పల్లె పాడవుతుంది వర్గ
వ్యవస్థతో వర్ణ వివక్ష తొ

పల్లె పాడవుతుంది పచ్చన్న నిరుద్యోగంతొ

పల్లె పాడవుతుంది
పనిచేయని యువతతొ

పల్లె పాడవుతుంది
పాత గోడలతొ పాత గొడవలతొ

పల్లె పాడవుతుంది
అతి తెలివితో

ఇంకా ....
పల్లె పాడవుతుంది విలువ లేని మాటలతో

పల్లె పాడవుతుంది
మొబైల్జేషన్ తొ

వెన. .....దుప్పల్లి. ..

ప్ర. ...



ప్రకృతి లొ జీవులు
ప్రసుాతి లొ జననం
ప్రకటన తొపెళ్లి
ప్రేమ  తొ జీవనం
ప్రయాణంలొ ప్రమాదం
ప్రమిదతొ చివరి  ప్రయాణం
ప్రయాణంతొ పరలోకం


14, అక్టోబర్ 2018, ఆదివారం

మగువ మనసు

తేమతొ తేనీరు తయారు చేయవచ్చు
తెగ నరికిన తల అతికించవచ్చు
తేనెతొ స్వర్గని పొందవచ్చు
కానీ...మగువ మనసు మనమెలా యేరుగును


ఆ"ఐదుగురు


దుప్పల్లి అనే  ఊరిలో  రామయ్య అనే పేద పుాజరి వుండేవాడు.
తన వృత్తిని దైవంగా బావించె వాడు. మనం పంచేంద్రియాలతొ 
జీవిస్తూ వాటిలో ఐక్యం కావలసిందే అని తన బాల్య మిత్రుడైన
 రసూల్  తొ అంటుండేవాడు. కులాలు వేరైన వారి స్నేహ
 ం కొనసాగుతూ వస్తుంది.


రసూల్ తన వృత్తియైన మాంస దుకాణం
 నిర్వహించేవాడు.రామయ్య తన యాచక వృత్తి తొ 
నలుగురిని నవ్విస్తు వుండేవాడు. రసూల్ చాలా కొపంతొ వుండేవాడు. 
 మనుషులు అవకాశవదులు వారికన్నా "అల్ల "నే 
నమ్ముకుంట అతడే సర్వ సం అనేవాడు.

రామయ్య కనీసం ఐదుగురు తొ నైనా మంచిగా 
వుండు అనేవాడు కానీ రసూల్ వినేవాడు కాదు.

 పిల్లలు ,సంసారం వంటివాని వేస్ట్

పేస్ట్ లాగా పోతుంది అనే వాడు

కానీ రామయ్య తన మిత్రుడి వింత 
చేష్టలకు దేవుడే కాపాడాలి అనే వాడు.

*********
ఒక రొజు ఉదయం రసూల్ రామయ్య ఇంటికి వచ్చి. 
.రామ్ బాయ్ ఆఐదుగురు అంటావు ఎవరు అన్నీ అడిగాడు.
దానికి రామయ్య తన మిత్రుడికి ఇప్పటికీ దేవుడు
 బుద్ధి ఇచ్చాడు అని ఇలా చెప్పసాగాడు.
ఆఐదుగురు అంటే నీవు" చనిపోయినపుడు 
నలుగురు నీను  మెుస్తె ఐదవవాడు
 నీ శవం ముందర నడిచి కర్మ కండ నిర్వహించేవాడు
 అని చెప్పగా.

అప్పటి నుండి రసూల్ అందరితొ 
కలసిమెలసి వుండేవాడు.


శుభొదయం Good Morning )


రవి తలుపు తెరెచెన
కిరణం విడిచేన
పక్షి ఆరిచేన పత్రం లేచేన
హిమం తొ పువ్వు సా ్ననంమడి
పురివిప్పెన
పంచభూతలు మరువవు
 "శుభొదయం"

13, అక్టోబర్ 2018, శనివారం

దసరా పండుగ

అమ్మలాంటి పల్లెలలో  సంబురాలు 
అచ్చు గుద్దిన పచ్చని చేనులతొ
బసవన్న రంకేలతొ 
అందమైన  పువ్వులతో 

కొత్త బట్టలతొ కొంగొత్తి ఆశలతో 

పాలపిట్టలతొ పడుచుల చప్పట్ల తొ 

పురాణాల గథాలను తలుచుకుంటూ 

నవరాత్రుల దేవి పూజ లతో 

దర్జీల చేతి నిండ పనితో 

పాఠశాలలాకు  సెలవులతొ 

పటాకుల చపుడుతొ

జమ్మి చెట్టు పుాజలతొ దసరా సంబురాలు 

పల్లెలలో  సంబురాలు అంబరాన్ని 
అంటేనా 

దసరా విజయాన్నిచ్చి 
విజయదశమిగా వెలుగు నింపేన 

*************

Velmajala Narsimha

10, అక్టోబర్ 2018, బుధవారం

బతుకమ్మ


పల్లవి:అడవి లో పుట్టిన గునుగామ్మ
ఆడవారి చేతులొ బతుకమ్మ 
బంగారు రంగులో 
తంగెడమ్మ
తల్లి కొడుకులంట మీ రామ్మ 

                 :అడవి లో పుట్టిన:


చరణం:పల్లె పాటలలో బతుకమ్మ 

తెలంగాణా తల్లి  మయామ్మ

రంగు రంగులో బతుకమ్మ 
మా ఇంటి ఇలవేలుపు నీవమ్మ

చరణం :బంతి పువ్వులంటి అక్కను 

              
నీ అక్కున చేర్చే వే బతుకమ్మ
తమ భాధను పాట రూపం లొ మార్చి 
పడుకుందురంట బతుకమ్మ.
          :అడవి లో పుట్టిన:
Narsimha.  V

9, అక్టోబర్ 2018, మంగళవారం

ఇగో ల రామాయ్య" (Ego not a mannerism is a foolishness)



పల్లవి:ఇగో ల రామాయ్య
నీ గోల ఎంటాయ్య

మా గోల మాదయ్య
నీ గోల ఎంటాయ్య

చరణం: ఉదయం లేవడం తోనే 

మాకు చేతిలో ఆండ్రాయుడ్  మొబైల్  కావాలి 

నెట్ లొ కొట్టి  వీడియోలు చుస్తామంటా 

సొల్లంత చూసేసి 
కళు నలుచుకుంటు లేస్తమంటా 

:ఇగో ల రామాయ్య: 

చరణం:సమయామే లేదంటూ 
పేసుబుక్ చాట్ చేస్తాం 

లైక్ లా షేర్ లతో లోకమే మాదేయంటాం

:ఇగో ల రామాయ్య: 

చరణం: మాకు ఆశయాలు లేవంటా 

మాకు లోకమే ఫొన్ నంటా 

:ఇగో ల రామాయ్య: 

నర్సింహ వెలుమజాల. ..

7, అక్టోబర్ 2018, ఆదివారం

ఆత్మ గౌరవం బతుకమ్మ .

ఆడవి పువ్వులు రాగి గిన్నె
పడతుల చేతి చపట్ల బతుకమ్మ
మన యాస మన ఆట మనపాట
తెలంగాణా ఆత్మ గౌరవం బతుకమ్మ
బతుకమ్మ అంటే భారత దేశం యొక్క పెద్దమ్మ

ఎదైనా కొద్ది కాలమే


ఎదైనా కొద్ది కాలమే
పుట్టుక దాని ఆనందం
ఎదైనా కొద్ది కాలమే
మంచియైన చెడుయైన

ఎదైనా కొద్ది కాలమే
 కష్టమైన సుఖమైన

ఎదైనా కొద్ది కాలమే
యవ్వనం దాని ప్రభావం

ఎదైనా కొద్ది కాలమే
ధనమైన దాని విలువైన

ఎదైనా కొద్ది కాలమే
సంసారం బంధువులు

ఎదైనా కొద్ది కాలమే
కాలం చేసినా గాయలు

ఎదైనా కొద్ది కాలమే
ఆశాయైన నిరాశయైన

ఎదైనా కొద్ది కాలమే
మరణమైన దాని భాధయైన




Velumajala Narsimha. Duppelli. ..

6, అక్టోబర్ 2018, శనివారం

బతుకమ్మ (దుప్పెల్లి)

1.పచ్చ పచ్చని పల్లెల మధ్య 

పచ్చిక బయళ్ళ పల్లెలలొన

పడమటి దిక్కున పచ్చని పల్లె 
పార్వతీపురం నొక్కటుండేను 

2జానకమ్మ  పుల్లయ్య పుణ్య దంపతులకు 

పుత్ర సంతానం లేక పుడమి పై మెుక్కని దైవం లేడు 

గౌడ వృత్తిని గౌరవంగా బావిస్తు 

బతుక సాగిరి ఆనందంగా 

3.తాటి వనంలో కంఠ మహేశ్వర 
ఆలయం నొక్కటి నిర్మించి  

ఆడవిలొ దొరికే తంగెడు గునుగు పువ్వులతో 

పుత్ర సంతానం కొసం పుాజలు చెసిరి 

4.వాన కాలం కు సెలవు చెబుతూ 
చలి కాలానికి  స్వాగతం పలుకుతూ

మంచు కురుసె  ఉదయం పుాట 

తాటి వనంకు బయలుదేరాడు పుల్లయ్య 

5.విరబుాసిన తంగెడు మధ్య 

వినిపించేన చిన్న  పాప శబ్ధం 

పాప కేరింతలు గమనించినా పుల్లయ్య

సంతానం లేని మాకు కులదైవం వరంగా బావించి  

పాపను ఇంటికి కొనిపోయే 

6.తలచిన దైవం కరుణించి 

మన బతుకన వెలుగు నింపుటకై
బతుకమ్మ గా ఇంటికి వచ్చానని 

జానకమ్మ ఆనందనికి
ఆవధులు లేవు బతుకమ్మ చుాసి

7.పెరుగుతూ వచ్చిన బతుకమ్మ కు 

పెళ్ళిడు వచ్చానని వరుడుని వేతక సాగిరి 

తంగెడు పువ్వులగా తలతల మెరిసేన బతుకమ్మ 

 పుత్తడి బొమ్మల కనిపించే బతుకమ్మ 

8.దసరా పండగకు మాసం ముందరా 

ఊరికి వచ్చేన కాలరా రోగం 

చెరువు కట్ట తెగి నష్టం కలిగేన 

ఊరుకు పటింది ఘతారని
గడ గడ వనికిర ఊరిజనం

9.డప్పు చాటింపు చెసిరి పెద్దలు 

బలి ఆడుగుతుంది అమెా ్మ రు తల్లి 

ఊరి లొ పెళ్ళిడు అమా ్మయులు 

ఇంటికి ని వదలి రావద్దన్నారు 

10.దసరా పదిరోజుల ముందరా 

ఊరి బాగు కోసం చెరువు లో దుాకి 

బలి గా మారెన బతుకమ్మ 

బాగు పడేన ఊరి జనం 
దేవత వెలసిన చెరువు గట్టు పై బతుకమ్మ 





5, అక్టోబర్ 2018, శుక్రవారం

భార్య Wif

బలపం పట్టింది పుట్టిన చోట 
బతుక నేర్చేన మరో చోట
 బంధం పెనవేసుకొన చోట
బంగారు బాట వేసేన ఆచోట 
తాళి తో ఆలి యైన చోట
తలవంచుక బతుకు  కదా ఈ చోట
పతియే తన భరొస యైన చోట
పట్టు విడువక వుండున ఈ చోట 
కట్నం తో వచ్చిన ఈ చోట 
కలసి నడవద కడదాక 
కష్టం నష్టం భరిస్తు నే 
కాపురం చేసేన ఈచోట 
సంతానం తో సంతృప్తి చెంది 
స్వర్గం పొందేన ఈచోట 





4, అక్టోబర్ 2018, గురువారం

ఐలవ్ యు 'టీచర్ " ILove U teacher Comic Story



దినియామ్మ పంతులు జీవితం "
పత్తి చేను వేసుకొన వాడి  జీవితం బాగుంది.
 నేను ఏమిటి మంజుల టీచర్ కు ఐలవ్ యు చెప్పడం.

 నాబట్ట తల రాత ఏమిటి? 

మాఆవిడ అటుంటుంది' తలమీద బొచ్చు
 లేనొడికి బోలెడు మంది లవర్స్ అని. 

అనట్లు మాఊరు దుప్పల్లి. ఊరి మీద
 మమకారంతొ సొంత ఊరిలొ తెలుగు టీచర్ గా పని చేస్తున్నా. 

మంజుల ఇంగ్లీష్ టీచర్. 

సొంత ఊరు మమకారంతొ  ఏడవ తరగతి
 మెుదటి టీచర్ గా పనిచేసే అవకాశం తీసుకున. 

ఈ వేదవలు నా పరువు తీసుకపొయు 
చెరువు లొ కలిపారు. 
వీళ్ల తలమీద తాటికాయ తగలేయ. 

నెక్స్ట్ పిరియడ్ ఇంగ్లీష్. 

 మంజుల టీచర్ .

యునిట్ టెస్టుల సమయం .

మేడమ్ తో నాలింక్ ఏమిటి. 

మేడమ్ "తల్లిదండ్రులు లేదా టీచర్ గురించి 
ప్రేమను తెలియజేస్తు  వా ్య సం రాయమంటే 
తలమీద మీద తాటికాయ పెట్టుకు తిరిగే వేదవలు 
ఏకంగా ఐలవ్ యు 'టీచర్ అని రాయడం ఏమిటి. 
మంజుల టీచర్ నాకు తెచ్చి ఇవడం
 మేము నవ్వు కొని దాని మలిచి నేను జేబులో వేసుకోవడం
 నా మతిమరపుని మంగకాయ తో కొట్టా. 

నాభార్య వనజ చుాడడం, బట్టతల పై బొప్పి వచ్చెల కొట్టడం 
నేను జాండ్ బామ్ జేబులో వేసుకోని పోవడం జరిగింది. 

"విధి ఆడిన వింత నాటకం లొ
 ఎవరొ వేసిన రాళ్ళు నాకే తాగిలాయ్. 


 

*గాంధీ పుట్టిన రోజంటా * song-13



పల్లవి : గాంధీ పుట్టిన రోజంటా 
సెలవు వచ్చేను 
శుభ దినమంటా 

భారత మాతకు ముద్దు బిడ్డంటా

దేశ బాపూగా ఎదిగిన నేతంటా 

చరణం:బొసి నవ్వుల తాతంటా
బొమ్మగ వచ్చేను నొట్ంటా
మన ఉప్పు కోసం పోరాటం 
ఉప్పు సత్యాగ్రహం చేసేనంట 

:గాంధీ పుట్టిన:

చరణం: బొసి నవ్వుతో బాపూజీ 
తరిమి కొట్టేన తెల్లోడిని 

భారత ప్రజలకు బాపూ యై 
బంగారు బాటలు వేసేనంట 

:గాంధీ పుట్టిన:

వెన. ..దుప్పల్లి. ..

చికెనుముక్క



వారం రోజులు కుారగాయలు 

వారం మధ్యలొ వంకాయ 

వారం చివర చింత పులుసు

వరుసగా వండి కుారగాయలు 

వంకర పొయేన ముాతి 
కంచం చెసెన పాచి



వచ్చేను వచ్చేను ఆదివారం 

చికెనుముక్క పై చెయ్యగ వంట 

మసాల దినుసులు తయారు చేసే 

ఆల్లం ముద్ద కారం చూసి 
ఆంగడకి  వచ్చి చికెను తెచ్చి 
ఆహా...ఒహొ మని ఆరగించెదమా 

చికెనుముక్క యని తోటి వారికి చెపుదామా 

Narsimha. Duppelli

1, అక్టోబర్ 2018, సోమవారం

కంచె బంతి song. 12

పల్లవి: సుారుటాకు నీళ్ళని సుటాకులొ పట్టి
కాలి అందెల చప్పుడు 
గణ గణ మేుగంగా 

చినుకు చినుకుల మధ్య
 రవి మెరుపులవస్తు

కంటికే కైపెక్కునా
కంచె బంతి 

నీను కన్నావారు మురిసిపోగా కంచె బంతి

       :సుారుటాకు:

చరణం:చెవిపోగు కింద చినుకు 
నీ చెంప నే ముద్దడా 

గుడిసెమీది గొల్లభామ 
వానాకు గొల గొల చేయంగా

గిజిగాడు గొంతు చించుక పాట నే పాడగా 

వాన లో మయురం కంచె బంతి 
నీ సరి జొడుగ నాట్య మడేన కంచె బంతి 

     :సుారుటాకు:


చికెనుముక్క*


వారం రోజులు కుారగాయలు 
వారం మధ్యలొ వంకాయ 
వారం చివర చింత పులుసు
వరుసగా వండి కుారగాయలు 
వంకర పొయేన ముాతి 
కంచం చెసెన పాచి
వచ్చేను వచ్చేను ఆదివారం 
చికెనుముక్క పై చెయ్యగ వంట 
మసాల దినుసులు తయారు చేసే 
ఆల్లం ముద్ద కారం చూసి 
ఆంగడకి  వచ్చి చికెను తెచ్చి 
ఆహా...ఒహొ మని ఆరగించెదమా 
చికెనుముక్క యని తోటి వారికి చెపుదామా 

Narsimha. Duppelli

*పంచేంద్రియాలు*


నీఆరొగ్యం బాగుంటే నీసంపాదన ఐదు  వందలుంటే ఎంతో మిన్న

 నీఆరొగ్యం బాగులేకుంటే ఐదు కోట్లు లునా సున్న.

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...