19, ఏప్రిల్ 2013, శుక్రవారం

narsimha /srisri poems/

దొరికేనా దోసెడు మానవత్వం: క
నపడేనా పిడికెడు మనిషితత్వం
యుగయుగాల చరిత్ర మనది
క్షణక్షణాల బ్రతుకు మనిషిది!

పురిటినొప్పుల అమ్మ కష్టం
పురుడుపోసిన ప్రకృతి సిస్టం
సాటిజీవికి తోడుగొచ్చిన
తరతరాల మానవాభీష్టం!

నిక్కమై నీల్గుతున్నది
అడుగడుగున అరాచకం
సత్యమై సాగుతున్నది
పరివిధమున పిశాచకం!

దేహాలు శాపాలై
దోషాల రూపాలై
బ్రతుకన్నది
బ్రతికున్నది
అనంత వివింత
ప్రపంచకంలో
రవ్వంత రప్పంత
కుతంత్రానికై: కు
సంస్కారానికై!

ఉచ్చ్వాస నిశ్వాసలు
ఊయలలూగే శరీరంలో
దారుణ దారుణాలు
దండలేసుకున్న సమాజంలో
మనిషొక వింత
సమాజమొక సంత!

రూపలకు దీపాలు పెట్టి
పాపాలకు దేవుని మొక్కి
రెండు చేతులా
అష్ట దిక్కులా
సర్వం సర్వస్వం
దోచుకునే దాచుకునే
మనిషికెక్కడ మోక్షం
దేవునికెక్కడ సాక్ష్యం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...