30, నవంబర్ 2016, బుధవారం
GANTI TELUGU EDUCATE ACADEMY: TELUGU GRAMMAR
GANTI TELUGU EDUCATE ACADEMY: TELUGU GRAMMAR: తెలుగు అక్షరమాల తెలుగు అక్షరమాల తెలుగు భాషకి అక్షరాలు 56 అవి అచ్చులు-16 అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ...
8, అక్టోబర్ 2016, శనివారం
21, సెప్టెంబర్ 2016, బుధవారం
Narsimha Velumajala: అంబేడ్కర్ నడుస్తున్న చరిత్ర
Narsimha Velumajala: అంబేడ్కర్ నడుస్తున్న చరిత్ర: I అంబేడ్కరా ... అంటరాని వారి ఇలవేల్ప బడుగుజీవుల బాగు పొరటవారథి చరిత్రనె తిరగరాసిన యుగపురుష నడుస్తున్న చరిత్రకు..గీతాచార్యుని ...
16, సెప్టెంబర్ 2016, శుక్రవారం
అంబేడ్కర్ నడుస్తున్న చరిత్ర
I
అంబేడ్కరా ... అంటరాని వారి ఇలవేల్ప
బడుగుజీవుల బాగు పొరటవారథి |
నడుస్తున్న చరిత్రకు..గీతాచార్యుని వలె...
II
నీవు పడిన కష్టాలు నీవు చుసినఆగచాట్లు ఆగ్రవర్ణల జాతిహంకరదోరణులు |
నడుస్తున్న చరిత్రకు..సాక్షధారలె ...
III
కుల మతధ్వేష వైరాని కలంతొ కల్చిన
నీఅనుభవములెముందుతరాలవారికిభవితగా మీరు రాసినరాజ్యాంగం దేశాన్నికి గీతొపదేశంగా నడుస్తున్నచరిత్రకు..నీవుచిరస్మరణీయుడవులె... . |
మీ...
నర్సింహ వెలుమజాల
తేది:14-4-2011
*** *** *** ***
18, ఆగస్టు 2016, గురువారం
18, జులై 2016, సోమవారం
11, మే 2016, బుధవారం
15, మే 2015, శుక్రవారం
Narsimha Velumajala: వేమన పద్యాలు
Narsimha Velumajala: వేమన పద్యాలు: రామనామ జపముచే మున్ను వాల్మీకి పాపి బోయడయ్యు బాపడయ్యె! కులను ఘనము గాదు గు...
6, ఏప్రిల్ 2015, సోమవారం
వేమన పద్యాలు
రామనామ జపముచే మున్ను వాల్మీకి
పాపి బోయడయ్యు బాపడయ్యె!
కులను ఘనము గాదు గుణమే ఘనమ్ము రా
విశ్వదాభిరామ వినురవేమ!
16, మార్చి 2015, సోమవారం
వరకట్నం
India is Good or Bad: వరకట్నం: వరకట్నం వరకట్నమా...వధువుపాలిటపిశాచమా కంప్యూటర్ యుగమా … కన్యలాపాలిటశాపమా ఆడపిల్లల ...
: నేనంటాను(ZPHS DUPPALLY)
India is Good or Bad: నేనంటాను: ZPHS Duppally I బ్రేకులు ఉనాయి చేతిలో సైకిల్ పడింది గోతిలో ...
17, జనవరి 2015, శనివారం
24, డిసెంబర్ 2014, బుధవారం
పాము కాటు
పాము కాటు నుండి ప్రాణాలు కాపాడే " సంజీవని " మొక్కలు
రాత్రనకా పగలనకా పంట పొలాల్లో తిరిగే రైతన్నలు , కూలీలు తరచుగా పాము కాటుకు గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో సంజీవనిలా పని చేసే కొన్ని ఔషధ మొక్కలు చేరువలోనే ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో వాటిని ఉపయోగించుకోలేక ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో పాము కాటు నుండి ప్రాణాలు కాపాడే ఔషధ మొక్కలు, వాటిని ఉపయోగించే విధానం గురించి తెలుసుకొని అందరికీ తెలియజేద్దాం !
ప్రపంచంలో సుమారు మూడు వేల రకాల పాములు ఉన్నప్పటికీ వాటిలో సుమారు 350 రకాలు మాత్రమే విషపూరితమైనవి. వీటిలో కట్లపాము, తాచుపాము, రాచనాగు, రాటిల్పాము, సముద్ర సర్పం, రక్తపింజర అతి ప్రమాదకరమైనవి.
వీటిలో తాచుపాము, నాగుపాము, కట్లపాము కాటేస్తే వాటి విషం నేరుగా కేంద్ర నాడీ మండలం, ఊపిరితిత్తులపై పని చేస్తుంది. హృదయ స్పందన ఆగి అప్పటికప్పుడే మరణం సంభవిస్తుంది. రక్తపింజర విషం ఎక్కువగా రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు చిట్లి నోటి నుండి రక్తం వస్తుంది. రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల కాటుకు గురైన వ్యక్తి మరణిస్తాడు.
ఎలా గుర్తించాలి ? ....
పాము కాటు శరీరం పైన పడిందా లేక బట్టల పైన పడిందా అన్న విషయాన్ని ముందుగా పరిశీలించాలి. శరీరం పైన కాటు వేస్తే ఎన్ని గాట్లు పడ్డాయో చూడాలి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడతాయి. అంతకంటే ఎక్కువ గాట్లు కన్పిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు.
వెంటనే ఏం చేయాలి ? ....
కాటు వేసిన శరీర భాగం నుండి ఇతర భాగాలకు రక్తప్రసరణ జరగకుండా పై భాగాన రబ్బరు లేదా తాడు లేదా గుడ్డతో గట్టిగా కట్టాలి. దీనివల్ల విషం త్వరగా గుండెకు చేరకుండా నివారించవచ్చు. దీంతో పాటు పాము కాటుకు గురైన వ్యక్తి నడవడం, పరిగెత్తడం వంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకునేలా చూడాలి.
ప్రథమ చికిత్సా ఔషధ మొక్కలు .....
నేటి ఆధునిక యుగంలో ఔషధ మొక్కల్ని వాడడం మొరటు వైద్యంగా కన్పించవచ్చు. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వీటిని ఉపయోగిస్తే రోగిని బతికించుకునే అవకాశాలు మెరుగుపడతాయి. తులసి, గాడిద గడప, పొగాకు, మారేడు, నేల వేము వంటి మొక్కలు ఈ కోవకు చెందినవే.
తులసి మొక్కలు అందరికీ అందుబాటులో ఉండేవే. పాము కరిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే పావు కిలో తులసి ఆకుల్ని బాగా నమిలి మింగాలి.
పొలాల్లో కలుపు మొక్కగా పెరిగే గాడిద గడప వేరును మెత్తగా నూరి పాము కరిచిన చోట ఉంచి కట్టు కట్టినా ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు రెండు చెంచాల వేరు పొడిని అర గ్లాసు మంచి నీటిలో కలిపి తాగించాలి.
పచ్చి పొగాకు అందుబాటులో ఉన్నట్లయితే దాని రసం తీసి తాగించాలి. ఎండు పొగాకు ఉంటే దానిని నీటిలో నానబెట్టి సారం దిగేంత వరకూ బాగా నలిపి వడకట్టి తాగించాలి. ఈ విధంగా అరగంటకు ఒకసారి చొప్పున నాలుగైదు సార్లు తాగిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడతారు. పొగాకును మెత్తగా నూరి పాము కాటు వేసిన చోట ముద్దగా కట్టినా మంచి ఫలితం ఉంటుంది.
మారేడు ఆకుల్ని మెత్తగా నూరి రసం తీసి రోగితో తాగిస్తే పాము కాటు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక అన్ని ప్రాంతాల్లో కన్పించే నేల వేము మొక్కను మెత్తగా నూరి గ్లాసు నీటిలో కలిపి రోగితో తాగించాలి. ఈ విధంగా అరగంటకు ఒకసారి చొప్పున నాలుగైదు సార్లు తాగించాలి. ఔషధ మొక్కల్ని ఉపయోగించిన తర్వాత రోగిని ఆసుపత్రికి తీసికెళ్లి అవసరమైన చికిత్స చేయించాలి .
వంట గదిలో దొరికే ఔషధములు ....
వంట గదిలో దొరికే పసుపు, మిరియాలు, వెల్లుల్లి, నిమ్మకాయ సైతం పాము కాటుకు సంజీవనిలా పని చేస్తాయి. నాణ్యమైన పసుపు కొమ్ముల్ని పొడి చేసి రెండు చెంచాల పొడిని అర గ్లాసు మంచి నీటిలో కలిపి అరగంటకు ఒకసారి చొప్పున నాలుగైదు సార్లు తాగిస్తే రోగి కోలుకుంటాడు. అలాగే 100 గ్రాములు తెల్ల మిరియాలను పొడి చేసి కషాయం కాచి వడపోసి రెండు మూడు సార్లు తాగించినా ఫలితం ఉంటుంది. 20 వెల్లుల్లి పాయల్ని నూరి పాలలో కలిపి తాగిస్తే ప్రాణాపాయం నుండి రోగి బయటపడతాడు. అదే విధంగా నిమ్మకాయలోని 10-15 గింజల్ని మెత్తగా నూరి నీటిలో కలిపి తాగించవచ్చు.
ఈ విధంగా ఆసుపత్రికి తీసికెళ్లడం సాధ్యం కాని అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా మనకు అందుబాటులో ఉండే ఔషధ మొక్కల్ని ఉపయోగించి రోగి ప్రాణాలు కాపాడవచ్చు. తేలు, మండ్రగబ్బ, తేనెటీగలు, కందిరీగలు వంటివి కుట్టినప్పుడు కూడా ఈ మొక్కల్ని ఉపయోగించి రోగికి ఉపశమనం కలిగించవచ్చు.
వీలైనంత తొందరగా ఆలస్యం చేయకుండా హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాలి .

హెచ్చరిక # ఇలా చేయకూడదు .....
పాము కరిచిన వెంటనే ప్రాణం పోతుందనే భయంతో పరిగెత్తితే విషం మరింత వేగంగా గుండెకు చేరి ప్రాణాలు త్వరగా పోయే ప్రమాదం ఉంది.
పాము కరిచిన చోట పెద్దగా గాయం చేసి విషాన్ని నోటితో పీల్చి ఉమ్మేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల గాయం మరింత పెద్దదై విషం చర్మంలోకి, చుట్టుపక్కల ఉన్న కణాల్లోకి వ్యాపించి త్వరతిగతిన గుండెకు చేరుతుంది.

24, ఏప్రిల్ 2014, గురువారం
28, ఫిబ్రవరి 2014, శుక్రవారం
చాణక్య సూక్తులు (Duppally peopls)
చాణక్య సూక్తులు
‘మరీ అంత నిజాయితీగా వుండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా వున్న చెట్లనే కదా!’
‘అన్ని పాములు విషప్పురుగులు కావు. విషపూరితం కాకపోయినా పైకి అలా కనబడే తీరాలి. లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం.’
‘ఎవ్వడు కూడా ఎలాటి స్వార్ధం లేకుండా మరొకడితో జట్టు కట్టడు. ఏ ప్రయోజం ఆశించకుండా వుట్టిగా స్నేహం చేస్తున్నానని ఎవడయినా చెబితే దాన్ని నమ్మినవాడే శుద్ద అప్రయోజకుడు.’
‘యెందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? - ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏపనీ మొదలు పెట్టవద్దు.’
‘అధైర్యం ఆవహిస్తోందని లేశమాత్రం అనుమానం వచ్చినా సరే, యెంతమాత్రం ఉపేక్షించవద్దు. దాన్ని మొగ్గలోనే తుంచేయండి.లేకపోతే మొదటికే మోసం.’
‘ఈ ప్రపంచంలో రెండే రెండు ప్రబలమైన, తిరుగులేని శక్తులు. ఒకటి యువశక్తి. రెండోది ఆడదాని అందం.’
‘పని మొదలు పెడితే ఆపవద్దు. మధ్యలో వొదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని.’
‘పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. కాని మనిషి మంచితనం మాత్రం నాలుగు దిక్కులకూ వ్యాపిస్తుంది.’
‘భగవంతుడు విగ్రహాల్లో వుండడు. మీ భావాలే భగవత్ స్వరూపం. మీ మనసే దేవాలయం.’
‘మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు కాని జన్మతః కాదు.’
‘మీ సంతానానికి అయిదేళ్ళు వచ్చేవరకు వారిని చాలా ప్రేమగా చూసుకోండి. ఆతరువాత అయిదేళ్ళు ఏదయినా తప్పుచేస్తే వారిని కఠినంగా దండించండి. కానీ పదహారేళ్ళు రాగానే మీ స్నేహితుడి మాదిరిగా చూసుకోండి. అలా పెరిగి పెద్దయిన పిల్లలే మీ జీవితంలో మీకు అత్యంత ఆత్మీయులయిన సన్నిహితులుగా మీ జీవితాంతం కలసి వుంటారు.'
‘మంచి పుస్తకాలు మనిషికి జ్ఞానాన్ని కలిగిస్తాయి. చెత్త పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం వుండదు. అంధుడి ముందు వుంచిన అద్దం మాదిరిగా.’
‘విద్యాధనం అన్నింటికీ మించిన గొప్ప ఆస్తి. అది వుంటే సంఘంలో గౌరవం లభిస్తుంది. విద్యాగంధం కలిగివుంటే అందం లేదనీ, వయస్సు మళ్లుతోందనీ మధన పడాల్సిన పని వుండదు. ఎందుకంటే , అది అన్నింటినీ కప్పిపెడుతుంది.’

3, జనవరి 2014, శుక్రవారం
22, నవంబర్ 2013, శుక్రవారం
I | బ్రేకులు ఉనాయి చేతిలో | |||
సైకిల్ పడింది గోతిలో | ||||
దపిఎ తిరదాని నేనంటాను | ||||
మండుటెండలొ విస్కీ తాగితే | ||||
II | పై పై అందం కల సుమా… | |||
లోపలిదంతడొలసుమా | ||||
మోసపొకాని నేనంటాను | ||||
నా జీవితమె ఉదాహరణ సుమా… | ||||
III | హృదయంతరంలొ ప్రేమపిచ్చి | |||
అది అందనిదాక్షా తీపి బాచి | ||||
ప్రేమలో దాహం తిరదాంటాను | ||||
జీవితానుభవసారం ఇదెసుమా… | ||||
(9వతరగతిలోఉన్నపుడు రాసిన) | ||||
నర్సింహ వెలుమజాల | ||||
15, నవంబర్ 2013, శుక్రవారం
25, అక్టోబర్ 2013, శుక్రవారం
18, అక్టోబర్ 2013, శుక్రవారం
గువ్వలచెన్న శతకము..
గువ్వలచెన్న శతకము...
పందిరి మందిరమగునా?
వందిజనంబా ప్తమిత్రా వర్గంబగునా?
తుందిలుడు సుఖముగనునా?
గొది నృపతిమార్గమగున? గువ్వలచెన్నా! !
భావం:- పందిరి సేదతీరే మందిరం అవుతుందా? అహా ఒహో అని చుట్టూ చేరి పొగుడుతూ వుండేవాళ్ళు ఆప్త బంధువులౌతారా? బాన బొజ్జగలవాడు హాయిగా ఉంటాడా? సందులు గొందులు రాజ మార్గాలు అవుతాయా? కావు. !
30, జులై 2013, మంగళవారం
9, జులై 2013, మంగళవారం
29, జూన్ 2013, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
ఉగాది@ 2019**
సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా ఉగాది ,కొత్త ఒరవడికి పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...
-
I అంబేడ్కరా ... అంటరాని వారి ఇలవేల్ప బడుగుజీవుల బాగు పొరటవారథి చరిత్రనె తిరగరాసిన యుగపురుష నడుస్తున్న చరిత్రకు..గీతాచార్యుని ...
-
తలవంచిది శరం అనుకుంటే తగ్గున సామర్ధ్యం ఉప్పొంగే నదీకైన తెలువదు తన బలమేంతొ తనతో తక్కువ వారిపై తగ్గున చులకన పలుకుబడి పనికిరాదు పతి చో...
-
వసంతాగమనం వచ్చింది ఉగాది పండగ తెచ్చింది చైత్ర మాసంలో వచ్చింది చెట్టుకొమ్మ చిగురించింది కాలగమనం మెుదలైంది కొకిలమ్మ గొంతు విపింది ...