2, జులై 2026, గురువారం

నందా... నా మిత్రమా!" కథ








ఆ రోజు రేపల్లెలో సందడిగా, పండగ వాతావరణం నెలకొంది. వానలు కురిసి వెలియడంతో, గోవర్ధనగిరి పచ్చటి తివాచీ పరిచినట్లు, ఆకాశానికి సరికొత్త రంగులు అద్దినట్లు నయనానందకరంగా కనిపిస్తోంది.

నందుడు తన చద్దిమూటను భుజానికి తగిలించుకుని, గోవులను గోవర్ధనగిరికి తోలుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. అంతలోనే, అతని కంటే చిన్నదైన లతాంగి, "నేను కూడా నీతో పాటు గోవర్ధనగిరికి వస్తాను" అంటూ మారాం చేయసాగింది. మరోపక్క వటపత్రుడు, కుశంకుడు కూడా తయారై కిట్టయ్య రాక కోసం ఎదురుచూస్తున్నారు.

ఒక చేతిలో పిల్లనగ్రోవి, మరో చేతికి బంగారు కడియం మెరుస్తుండగా... గోవుల ముందర నడుస్తున్నాడు నల్లనయ్య. ఆ కిట్టయ్య వెనుక మిగిలిన ఆవులు, నందుడు మరియు గోపబాలురంతా కలిసి గోవర్ధనగిరి చేరుకున్నారు.

ఎప్పటిలాగే కిట్టయ్య గోవుల చుట్టూ ఒక కర్రతో గీత గీశాడు. ఆపై ఒక చెట్టు నీడన కూర్చొని, పిల్లనగ్రోవితో వినసొంపుగా మురళీగానం చేయసాగాడు. ఆశ్చర్యంగా ఆ గోవులన్నీ ఆ గీత లోపలే ఉంటూ ప్రశాంతంగా నెమరువేస్తున్నాయి. కిట్టయ్యకు ఎంతో ఇష్టమైన 'గోలక్ష్మి' అనే ఆవు తన దూడకు పాలు ఇస్తోంది. కానీ, మిగిలిన గోపబాలురు మాత్రం తమ మందలను ఎండలో నిలబడి మేపాల్సి వస్తోంది.

అలా కొన్ని రోజులు గడిచాయి. కిట్టయ్య ప్రతిరోజూ రావడం, గోవుల చుట్టూ కర్రతో గీత గీయడం, వేణుగానం చేయడాన్ని నందుడు నిశితంగా గమనించాడు.

ఒకరోజు నందుడు కూడా కిట్టయ్య లాగే తన మంద చుట్టూ కర్రతో గీత గీశాడు. కానీ, ఆ ఆవులు గీత లోపల ఉండకుండా చిందరవందరగా విడిపోయాయి. కిట్టయ్య గీసిన గీత దాటని ఆవులు, తమ గీతను మాత్రం అస్సలు లెక్కచేయడం లేదు. ఇది చూసి కొన్ని రోజుల పాటు గోపబాలురంతా కలిసి, కర్రలతో తమ గోవుల చుట్టూ పెద్ద గీతలే గీశారు. అయినా సరే, ఆవులు మాత్రం అటు ఇటు చెల్లాచెదురుగా వెళ్ళిపోతూనే ఉన్నాయి.

దీంతో విసిగిపోయిన నందుడు, గోపబాలురంతా కలిసి కృష్ణుడి దగ్గరకు వెళ్లి ఇలా అడిగారు: "కిట్టయ్యా! నీవు కర్రతో గీసిన గీతను ఆవులు దాటడం లేదు. కానీ మేము ఎన్నిసార్లు, ఎంత పెద్ద గీతలు గీసినా అవి నిలవడం లేదు, ఎందుకని?"

దానికి ఆ నందనందనుడు మందహాసం చేస్తూ, చిరునవ్వుతో ఇలా అన్నాడు: "చూడు నందా, నా మిత్రమా! ఈ సృష్టిలో ప్రతి జీవికీ దేనికదే ప్రత్యేకత ఉంటుంది. ఇతరులను అనుకరించడం, వారిలాగే జీవించాలనుకోవడం అసాధ్యం. ఆ అనుకరణే మనిషి దుఃఖానికి అసలైన కారణం అవుతుంది. నిన్ను నువ్వు తెలుసుకుని, నీలాగే నువ్వు జీవించి చూడు... అప్పుడే నీ జీవితంలో ఎంతో ఆనందం వెల్లివిరుస్తుంది."

కృష్ణుడి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన గోపబాలురు పరమానందం చెందారు. అంతలోనే గోధూళి వేళ కావడంతో, గోవులను తీసుకొని అందరూ కలిసి సంతోషంగా ఇళ్లకు తిరుగుపయనమయ్యారు.


వెల్మజాల నర్సింహ.21.06.2026


బూచోడు

 రంగులు మారుస్తూ గర్జిస్తున్న ఆకాశాన్ని చూస్తూ

గుడిసె సూరట్టాకు  కింద ఉన్న పక్షి పిల్లలు, "అమ్మా! భయపెడుతున్నాడు" అంటాయి.

తల్లి ఇలా అంటోంది... "బూచోడు  కదమ్మా, వాడి పని అంతే!
భయపడితే బతకలేము, అయినా మన గుడిసె చూశారుగా ఎంత పెద్దదో!.."

అమ్మ మాట ముందు ఆకాశం చిన్నదైనది.

సార్ పోయారు ( కథ

 


ఉదయం వాతావరణం ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. ఆ రోజు పేపర్ ఒకసారి తిరగేసాకే మిగతా పనులు చూసుకోవడం నా అలవాటు.

పేపర్‌పై "ఆరుద్ర కార్తె ఆరంభం" అని పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగ్ ఉంది. దాని కిందనే "కరణం బలరామయ్య మరణం" అనే వార్త కనిపించింది. అది చూడగానే గుండె ఆగినంత పనైంది. కొంచెం సేపు స్టన్ అయిపోయాను. ఆ తర్వాత తేరుకుని వార్త మొత్తం పూర్తిగా చదవడం మొదలుపెట్టాను.

"దుప్పల్లి గ్రామంలో ముప్పై ఏళ్లుగా ఊరి పిల్లలకు రాత్రి బడి చెప్పిన కరణం బలరామయ్య, చీమలు కుట్టడంతో మరణించారు" అని ఉంది ఆ వార్తలో.
అది చదవగానే ఒక్కసారిగా నా చిన్ననాటి ఊరు కళ్లముందు కదలాడింది. ఎన్నో ఏళ్ల క్రితం మా ఊరికి వచ్చిన తొలి తెలుగు పండితులు ఈ సార్. అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వ నిర్ణయం వల్ల త్వరగా రిటైర్మెంట్ తీసుకుని, తన సొంత ఊరికి వెళ్ళిపోకుండా మా ఊర్లోనే ఉండిపోయారు. నాలాంటి వాళ్లెందరినో విద్యావంతులను చేసిన మహానుభావుడాయన. అలాంటి వ్యక్తి ఇలా చీమలు కుట్టి మరణించడం ఏంటి? అని ఆలోచనలో పడ్డాను.

ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ స్క్రీన్ చూస్తే ఊరి నుంచి వెంకన్న చేస్తున్నాడు. సార్ ఇంటికి దగ్గరలోనే వాళ్ల ఇల్లు ఉంటుంది. నా రింగ్ టోన్ 'ఇదే నా పల్లెటూరు' సాంగ్ వస్తోంది.

ఫోన్ ఎత్తగానే, "ఒరేయ్! మన సార్ చనిపోయాడురా. త్వరగా హైదరాబాద్ నుండి వచ్చేయ్. ఇంకా చాలా మందికి చెప్పాలి" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు వెంకన్న.

వెంటనే నేను, రాము కలిసి బస్సులో ఊరికి బయలుదేరాం. ప్రయాణమంతా సార్‌తో గడిపిన క్షణాలే ఆలోచనలుగా ముసురుకున్నాయి.
రాము అన్నాడు, "సార్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కదా?" అని.
నేను అవునంటూ తలూపాను.

"ఇద్దరు కొడుకులు అమెరికాలో స్థిరపడ్డారు. కూతురు చాలా తెలివైనది, లండన్‌లో ఉంటుంది. అక్కడ చార్టర్డ్ అకౌంటెంట్ అంట" అని గుర్తుచేసుకున్నాం.

సార్ గత పదేళ్లుగా, మేడం కాలం చేసిన నాటి నుండి ఆ ఇంట్లో ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. 
సార్ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు: పుట్టినప్పుడు తల్లిదండ్రులే సర్వస్వమని, పిల్లలుగా ఎదిగే క్రమంలో స్నేహితులే లోకమని, ఆ తర్వాత ప్రియురాలు లేదా భార్యే సర్వస్వమని, ఆపై పిల్లలు, ఇల్లే ప్రపంచమనుకుంటూ మనిషి జీవిస్తాడు. కానీ, చివరకు అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఈ లోకంలోకి ఒకరిగా వచ్చి, ఒక్కడిగా పోవడమే జీవిత పరమార్థం. అది సార్ విషయంలో నిజమైంది."

"సార్ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు: పుట్టినప్పుడు తల్లిదండ్రులే సర్వస్వమని, పిల్లలుగా ఎదిగే క్రమంలో స్నేహితులే లోకమని, ఆ తర్వాత ప్రియురాలు లేదా భార్యే సర్వస్వమని, ఆపై పిల్లలు, ఇల్లే ప్రపంచమనుకుంటూ మనిషి జీవిస్తాడు. కానీ, చివరకు అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఈ లోకంలోకి ఒకరిగా వచ్చి, ఒక్కడిగా పోవడమే జీవిత పరమార్థం. అది సార్ విషయంలో నిజమైంది."

మేము సాయంత్రానికి ఊరు చేరుకున్నాము. ఇంకొంతమంది మిత్రులతో కలిసి సార్‌ను చూశాం. రాత్రంతా అక్కడే యక్షగానాలు చూస్తూ గడిపాము. మరుసటి రోజు సాయంత్రానికల్లా సార్ వాళ్ళ పిల్లలు వచ్చారు. ఆ తర్వాత ఎంతో ఘనంగా, ఊరేగింపుగా సార్ అంతిమ యాత్ర జరిగింది.

కానీ, ఊరంతా ఒకటే మాట అనుకుంటున్నారు... "చివరి రోజుల్లో ఒంటరిగా ఉంటూ, ఒంటికి చీమలు పట్టి చనిపోయాడు; ఆ పాపం వాళ్ళ పిల్లలకే తగులుతుంది" అని.

మూడవ రోజు పిట్టకు అన్నం పెట్టే సమయం (చిన్నకర్మ). ఇల్లంతా హడావిడిగా ఉంది. పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దామని నేను, రాము కలిసి లోపలికి వెళ్ళాము. సార్ కూతురు జ్యోతక్క మమ్మల్ని చూసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. ఆ తర్వాత లోపలి గదిని చూపిస్తూ...

"సార్ రోజు పడుకునే ఆ కట్టెల మంచం, దానిపై మెత్తగా ఉండే ఆ రెండు దుప్పట్లు, పక్కనే చెదలు పట్టిన ఆ పాత భగవద్గీత పుస్తకం ఉన్నాయి కదా... వాటిని కాస్త బయటకు తీసుకురండి తమ్ముడూ" అన్నది అక్క.

సరేనని మేము వాటిని బయటకు తీసుకువచ్చి, ఆ దుప్పట్లను గట్టిగా దులిపాము. అంతే... వాటి మధ్యలో నుండి రెండు పెద్ద తేళ్ళు టపటపా కింద పడ్డాయి!

అవి చూడగానే మా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. అప్పుడు అర్థమైంది... సార్ చీమలు కుట్టి చనిపోలేదు! అది వర్షాకాలం కావడం వల్ల, పక్కనే ఉన్న దుక్కి దున్నిన పొలం నుండి ఆ తేళ్ళు ఎలా వచ్చాయో ఏమో కానీ, దుప్పట్లలో చేరాయి. ఆ రాత్రి సార్‌ను అవే కరిచి ప్రాణం తీశాయి!

అయ్యో సార్! చనిపోయే ముందు ఆ కటిక చీకట్లో, ఆ నిర్జన గదిలో ఆ తేళ్ళు కుడుతుంటే ఎంత నరకయాతన అనుభవించారో కదా! ఆ నిస్సహాయ స్థితిలో ఎవరిని పిలవలేక, ఆ నొప్పిని భరించలేక ఎంత విలవిలలాడిపోయారో! ఊరి వాళ్ళేమో పిల్లలను నిందిస్తున్నారు, కానీ సార్‌కు రాసిపెట్టి ఉన్న ఆ ఘోర విధిని ఎవరూ మార్చలేకపోయారు. చివరి క్షణంలో ఆ భగవద్గీత సాక్షిగా ఎంత ఘోరమైన మరణాన్ని పొందారో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది.

వెల్మజాల నర్సింహ 17.06.26.

మిత్ర భేదం కథ

  



అనగనగా 'మానసపుర' అనే మృగ సామ్రాజ్యం. ఆ రాజ్యానికి ఉగ్రుడు అనే సింహం రాజు. ఆ రాజు దగ్గర జంబుక అనే నక్క మంత్రిగా ఉండేది. జంబుక మహా జిత్తులమారి. ఎలాగైనా సింహాన్ని మాయం చేసి, తానే ఆ మానసపుర రాజ్యానికి రాజు కావాలని దానికి గూఢమైన కోరిక ఉండేది.


అదే రాజ్యంలో చరక అనే ఒక తెలివైన కుందేలు తన పరివారంతో కలిసి నివసిస్తూ ఉండేది.

ఒకరోజు ఉదయం చరక తన కుటుంబంతో కలిసి పచ్చటి గడ్డిని మేయడానికి బయటకు వచ్చింది. అది గమనించిన జంబుకకు ఒక దురాలోచన వచ్చింది. జంతువులన్నింటినీ భయపెట్టి తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకుంది. వెంటనే గట్టిగా అరుస్తూ—
"చరకా! జాగ్రత్త! అటువైపు నుంచి మహారాజుగారు వస్తున్నారు. వెంటనే పారిపోండి!" అని అబద్ధం చెప్పింది.
రాజు పేరు వినగానే భయపడిన కుందేళ్లు ప్రాణాలు దక్కించుకోవడానికి వేగంగా పొదల్లోకి దూరి దాక్కున్నాయి. అది చూసి జంబుక మురిసిపోతూ, క్రూరంగా నవ్వుకుంది.
"ఈ రాజ్యానికి కాబోయే రాజును నేనే! నాకంటే బలవంతుడైన సింహాన్ని వాడుకుని నేనే అందరినీ శాసిస్తున్నాను. ఈ జంతువులకు నా పేరు చెప్తేనే వణకాలి!" అని మనసులో అనుకుంది.

ఆ తర్వాత జంబుక ఉపాయంతో రాజును వేటాడకుండా చేసి, తనే స్వయంగా జంతువుల నుంచి పన్నుల రూపంలో ఆహారాన్ని వసూలు చేయడం మొదలుపెట్టింది. సింహాన్ని గుహకే పరిమితం చేసింది. కాలం గడుస్తున్న కొద్దీ అడవిలోని జంతువులన్నీ జంబుకను చూసి భయపడటం మొదలుపెట్టాయి.
అధికారం చేతికి వచ్చేసరికి జంబుకకు బద్ధకం, అహంకారం పెరిగిపోయాయి. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవడం మానేసింది. రోజురోజుకూ పెరిగిపోతున్న జంబుక అహంకారాన్ని, బద్ధకాన్ని తెలివైన చరక (కుందేలు) గమనిస్తూనే ఉంది. నక్కకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది.
అది కడు వేసవి కాలం. అడవి అంతా ఎండిపోయి ఉంది. ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చి ప్రమాదవశాత్తూ ఎండుగడ్డికి నిప్పు పెట్టాడు. ఆ మంటలు క్షణాల్లో అడవి అంతా వ్యాపించసాగాయి.
ఆ ప్రమాదాన్ని ముందుగానే గమనించిన చరక, తన పరివారంతో కలిసి సురక్షిత ప్రాంతానికి పరుగులు తీయడం ప్రారంభించింది. దారిలో సోమరిగా పడుకుని ఉన్న జంబుకను చూసి చరక గట్టిగా హెచ్చరించింది:
"మంత్రిగారూ! అడవి తగలబడిపోతోంది, వెంటనే పారిపోండి!"

కానీ, అహంకారంతో ఉన్న జంబుక కళ్ళు తెరవలేదు.
"ఈ కుందేళ్లు ఎప్పుడూ ఇంతే... పిరికివి! ఏదో చిన్న పొగ చూసి భయపడిపోతున్నాయి. కాబోయే రాజును, నన్నే బెదిరిస్తాయా?" అని నిర్లక్ష్యంగా నవ్వి, అక్కడే ఉన్న ఒక పెద్ద పొద చాటుకు వెళ్లి మళ్లీ పడుకుంది.

కానీ చూస్తూ చూస్తూనే మంటలు అడవిని చుట్టుముట్టాయి. జంబుక పడుకున్న పొదకు కూడా నిప్పు అంటుకుంది. బద్ధకంతో, అతివిశ్వాసంతో ఉన్న జంబుక తప్పించుకునే లోపే మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. చరక తన సమయస్ఫూర్తితో, హెచ్చరికలను గమనించడం వల్ల తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది.
నీతి :
మన చుట్టూ ఏం జరుగుతుందో ఎల్లప్పుడూ గమనిస్తూ, సమయస్ఫూర్తితో జీవించాలి. అతివిశ్వాసం, బద్ధకం మరియు నిర్లక్ష్యం మనిషిని (లేదా జంతువునైనా) నాశనం చేస్తాయి. 




వెల్మజాల నర్సింహ.




6, ఏప్రిల్ 2019, శనివారం

ఉగాది@ 2019**


సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం

ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది

వసంత గమనం వచ్చింది
చెట్టు కొమ్మ చిగురించింది


యుగాది పండగ వచ్చింది
నవ యుగానికి నాంది పలికింది

చైత్ర మాసం తిరిగి వచ్చింది

కోకిలమ్మ గొంతేంతి పాడింది

వికారి నామ సంవత్సరం వచ్చింది

ప్రజలను  వుత్తేజపరిచింది

పండితుల రారండొయ్
పంచాంగాని వినవించండొయ్

వెలుమజాల నర్సింహ. .

31, మార్చి 2019, ఆదివారం

అంబేద్కర్- మనోవిక్షిప్తి




20వ శతాబ్దం 1925-1943 సం:ల మధ్య కాలం.

బాబా సాహేబ్ అంబేద్కర్' బొంబాయి యునివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా  పని చేసే రోజులలో ధారవి, కుర్లా ప్రాంతలలొ వున్న నిమ్న జాతి మనుషుల పై జరిగే జాత్యహంకారనికి ఎంతో భాధ పడేవాడు.

సమాజం మారాలా లేదా నేను మారాలా అని  మధన పడుతున్న రోజులు  .

దళితులను దూరంగా చూడడం యేంటి, మేము మనుషులమే కాదా అని చేప్పిన వినే హిందూ దేవుడు లేడు.
హిందూ ధర్మము లేదు.

అంటరానివారంటా ముట్టుకోకుడాదు.
పైగా తమ సంప్రదాయం గొప్పదని వాదనలు .

చిన్నపుడు గొరేగావ్ "లొ జరిగిన అవమానం మరియు తనకు ఇష్టమైన సంస్కృతం నేర్చుకొనియాలేదనే భాధ. రెండు
సంఘటనలు నిత్యం
గుండెలో రగులుతుంటే
తన ఆవేదనను "ముాక నాయక్"పత్రిక ద్వారా
ప్రజలకు  తెలియాలని
 భవించాడు.

ధళితులకు దేవుడే లేడు పైగా హిందూ సంప్రదాయం లొ గొప్పగా ముప్ఫై ముాడు కోట్లమందంటా.

సేవ చేసే వారిని సేవకులుగాను ,సాధు జంతువుల మాంసం తినటంయేంటాని పత్రిక ద్వారా తన ఆవేదనను తెలియజేసాడు.

ఆగ్రా వర్ణమనే ఆహకారం, దానికీ తొడు రాజకీయ, ఆర్థికంగా వుండడం నిమ్న జాతి మనుషులను మనుషులుగా చూసేవారు కాదు.


అంబేద్కర్ ఎంతో మనోవేదన చెంది.

హిందూవుగ పుట్టిన నేను హిందూవుగ మరణించానుగాక అని  ప్రకటించాడు.

సమాజం మారాలంటే పోరాటంతొ మారాదు
రాజకీయంగా మరియు విద్య పరంగా  అభివృద్ధి చెందాలి అని ప్రకటించాడు.

ఎన్నో గ్రాంధాలను పఠించాడు. సిక్కు, ముస్లీం, పార్శీల మతా గురువులను కలిసాడు.
వారి మతాల గొప్పదనం తెలుసుకొన్ని.

భారత దేశ ప్రజలను మున్ముందు వచ్చే భావితరాలను దృష్టిలో వుంచుకొని.

చివరకు మన తెలుగువాడైన
Professor. పి.లక్ష్మీ నర్సు ని  కలసి
  అతడు రచించిన గొప్ప పుస్తకం
"ధ యేసేన్స్ ఆఫ్ బుద్ధిజం "
(The Essence of Buddhism ")చదివి
బాబా సాహేబ్
ఐదు లక్షల మందితో బౌద్ధం స్వికరించాడు.


ఐనా. ..

ఉదయం పుాసిన పువ్వు సాయంత్రం వాడి పోవడమే దుఃఖం కాదా

ఇప్పటికీ కుల పట్టింపులు తను నడయాడిన ముంబై ప్రజలకు వున్నదనడం లొ సందేహం లేదు.

 వారిని భీమ్ జాతిగా పరిగణించి తక్కువ చుాపు చుాడడం నేటికీ  జరుగుతుంది.

ఏది ఎమైన మళ్లీ అంబేద్కర్ కలలు కన కుల రహిత సమాజం నిర్మాణమయేదేపుడొ.

..యుగ పురుష మళ్లీ పుట్టావా.
********

వెలుమజాల నర్సింహ. .

30, మార్చి 2019, శనివారం

మిత్రమా మళ్ళీ వస్తున్న


మిత్రమా మళ్ళీ వస్తున్న
ఏవొ కొత్త ఆశలు తెస్తున్న

 నాతో పాటే మంచు బిందువులు

ఆపై కొత్త కోరికలు

ఐదు అయుంది ఆపై మొబైల్ కోడి కుసింది

నా ఉషొదయం తొ శుభొదయం ప్రకృతి మిత్రమా

మనమే కాదా పర్మినెంట్ పతిదినం.

27, మార్చి 2019, బుధవారం

గరళం మిగింతే శివుడౌవుతావు

గరళం మిగింతే శివుడౌవుతావు

గంగాను మెుసే దేవుడౌతావు

ఇతరులకు సలహాలంటే
ముందుటావు

సాహయమంటే పరుగేడుతావు

ఇతరులను చేడుపుటకు ముందుటావు

పక్కొడి తొ తన పొటీ  అంటావు

బండాను చెక్కి బొమ్మంటావు

బొమ్మ లో దేవతా కొలువు అంటావు

నీతులు వినుటాకు ముందుటావు

పాటించమంటే పని తీరదంటావు

23, మార్చి 2019, శనివారం

మనో నేత్రం



మనిషి పుట్టుక మరణం మనిషి చేతులలో లేదు .మానవ జాతి ఎంతో అభివృద్ధి చెందిన మానవ శరీరంలొ ఒక చిన్న  భాగం తయారు చేయలేక పొయ్యారు .

 భూమిని తల్లిగా, ఆకాశం ను తండ్రిగా బతికే జీవి నయనంద.

నయనంద పుట్టుకతో ఆంధుడు పైగా కన్నా వారెవరో తెలీదు.


ఊరు చివర పుారి గుడిసెలో జీవిస్తు,

 పంచభూతలను  బంధువులుగ భవించేవాడు.

నయనంద కు పాటే ప్రాణం ,మనసే గాయం

పతి మనిషి పుట్టుకకు ఎదొ అర్థం వున్నదని నమ్మే వాడు

పతి పండుగలు తన బంధువుల పెండ్లిలు
అనే వాడు ఎందుకంటే
కడుపు నిండ విందు భొజనాలు దొరుకుతాయి

ఎండగా వుంటే నాన్న కోపంతో వున్నాడని

వానకాలం వస్తే' వాన మామ" అమ్మ కు పచ్చని బట్టలు తెస్తాడు అంటుంటాడు' నయనంద.

ఊరులొ ఆహారం అడుకోవ్వడానికి పొతే

చరణ్ తన మిత్రులతో కలిసి నయనంద ను  గుడ్డివాడు వచ్చిండని ఏగతాళి చేసేవాడు .

నయనంద మనసులో గుడ్డివాడు అనగానే ఒక్కంత భాధగా వున్నా
ఏమి చేయలేనుగా అనుకునే వాడు .
చిరు నవ్వుతూ ముందుకు పొయ్యాడు .

"అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది
అనుకునే వాడు.


ఆది  "శ్రీ విళంబి నామ సంవత్సరం "2019 రాజకీయ పార్టీల చందాలతో  హోలీ సంబురాలు
ఎంతో సంతోషంగా జరుగుతున్నాయి.

చరణ్ తన మిత్రులతో
తగ్గినా మైకంలో

ఈరోజు రాత్రి నయనంద గాడి గుడిసె తగ్గుల పెట్టాలి గుడ్డొడి ఆట చుాడాలి అంటు నవ్వుకున్నారు.

హోలీ రొజు కావున
ఊరులొకి కొంచెం చీకటిలో పొతే అన్నం కుారలు దొరుకుతాయి అనుకుని
బయలు దేరాడు నయనంద.

అదే అదునుగా భవించిన చరణ్ తన మిత్రులతో వచ్చి నయనంద గుడిసెకు నీప్పు అటించాడు

గుడిసె కాలి బూడిదయిపోయింది.

ఉదయం వచ్చి చూసినా. ఊరి జనం కు వింత అనుభవం ఎదురైంది.

నయనంద కాలిన గుడిసె పక్క కు నిద్రపోతున్నాడు
లేపి అడిగితే  ,నాకు తెలుసు రాత్రి వచ్చేసరికి గుడిసె మండుతూ వుంది .

గొంతు చించుకొని అరచి మిమ్మల్ని భాధ పెట్టాడం
ఇష్టం లేక. ఇలా పడుకున్న ను అన్నాడు.

"సంతోషం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు ఆది నీలో మరియు నీతో నే వుంది.  దానికి కావలసింది "మనో నేత్రం"

వెలుమజాల నర్సింహ:

21, మార్చి 2019, గురువారం

హోలీ 2019


ఒళ్లంతా రంగులు మయం

కండ్ల లో అమాయాకత్వం

వసంత మాస వయ్యారాలు

మెుదుగు పువ్వుల సింగరాలు

కామ దహన మంటే
నవ్వనం  మనసులో  హోలీ

ప్రకృతి లో పతి జీవిలో మార్పే హోలీ

చెట్టు చిగురుటాకు పిందె ముదిరే కాలం

నవయుగ కాలం కోసం
వసంత కాల ఆగమనం హోలీ

పల్లె కన్యాల పెండ్లి భజే హోలీ
పిల్లల పెద్దల రంగుల మయం హోలీ.  

*******************

వెలుమజాల నర్సింహ

16, మార్చి 2019, శనివారం

✍నిశ్శబ్దం



ఉదయం పుాట పత్రాలు  
సదుమదిగిన వెళ్ల సత్రలు

కడువ నిండ నీళ్ళు
చెట్టు నిండ పళ్లు

తిమిరం లొ సముద్రం

తీగలొ విద్యుత్

మనసులో భాధ

మగసింహ వేట

నిశ్శబ్దమే

Velmajala Narsimaj

8, మార్చి 2019, శుక్రవారం

అందమైన పల్లెలు

అందమైన పల్లెలు పచ్చని పంట చేలు

ప్రకృతిపురుషుడుతొ కార్యం చేసి

పంట చేలు పురుడు పోసుకునే

పగిలిన మడిమలు ప్యారాగన్ చెప్పులు

నెత్తిన వరి కట్టలు వేసుటకు కుప్పలు

వరిమళు  ఒంటి కాళ్ల  జంపంతొ కొంగలు

నవ్వుతూ పారే నీళ్ళు
నీటి పై ఆడే చీమలు

ఆడుగడున పచ్చదనం
ఆడే లేగ దూడలు

అమాయక ప్రజలు కనుమరుగైయేన
పల్లెలో

*************
వెలుమజాల నర్సింహ.

27, ఫిబ్రవరి 2019, బుధవారం

జయహో భారత్‌



మరుగుతున్న రక్తం  మాటల యుద్ధం కాదు

చేతలతొ సమాధానం
 చేసేన సైన్యం

పుల్వమా  పాపం పండేన నేడు

మానవ మృగాలను మట్టు మాయం చేయ

మరో సర్జికాల్ సాహసం చేసేన సైన్యం

భరతమాత కడుపుకోతకు

సమాధానం నేడే జరిగేన
కాలేన రావణ కాష్టం
ముష్కరుల శవాలతొ

జైహింద్ జైహింద్ శబ్ధం
మెుగేన మన గుండెలలొ



22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

కొంటే కోరిక. .




రాత్రి కరిచింది దోమ

పగలే చుసిన నా కర్మ

నెరిసిన నెత్తికి రంగు
నిలువదు ఎప్పుడు బొంగు

కడుపులో ఆకలి గోల
అరగదు రాత్రిరి వేల

కత్తితో కోసిన కోరిక
కడదాక విడువని తీరిక

3, ఫిబ్రవరి 2019, ఆదివారం

మహార్ధశ



 
తలవంచిది శరం అనుకుంటే
తగ్గున సామర్ధ్యం

ఉప్పొంగే నదీకైన తెలువదు తన బలమేంతొ

తనతో తక్కువ వారిపై
తగ్గున చులకన

పలుకుబడి పనికిరాదు
పతి చోట

ప్రేమ ఎంతో పవిత్రమైన
స్వార్ధం లేనిది వుంటుద

ఎంతో దుారం నడిచినా  మెుదటి అడుగే మరువకుమా

బంధువులు ఎంతో దగ్గరి వారైనా

బాల్య మిత్ర బంధంతొ సరి తుగునా

******************

*వెలుమజాల నర్సింహ*

1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

:నాటి బాల్యం:



టైర్ ..లతో గడిచినా బాల్యం వైర్యం  విడిచేన

గొళ్లీల ఆటలలో గడిచినా బాల్యం
గొప్పగా బతుకే నేర్పేపెన

మామ్మ మక్కా. ..మా బాల్యపు పిలుపులేన

కాబడీ ఖొ ఖొ ఆటలతొ
పెరెగెన సమాఖ్యత


నేడు  ఆడిన ఆటలు కనుమరుగైయేన

మొబైల్ గేమ్స్ ల లోలీ మెుదలైయేన

సంస్కారానికి సమయం లేదు
ఇరుగు పొరుగు ఇరుకై పొయే

మనుషుల మధ్య వైర్యం పెరిగి
మంచులో ముంచిన దుాదైయేన

నేటి బాల్యం, బలపం బతుక నేర్పితే

ఈనాడు మొబైల్ వచ్చి మెుసం నేర్పే

సమయం లేని నేటి బాల్య జీవనమా

సరదాగా కాసేపు   పక్కవాడితొ గడుపుమా

వెలుమజాల నర్సింహ. ..

28, జనవరి 2019, సోమవారం

ఒరేయ్. .నా మిత్రమా. .



నేను అనుకుంట ఒరేయ్ అని పిలవాలని

 మొదటిసారి నిన్ను చూసినా పిలుపు

ఒరేయ్. ..రా ల పెరిగిన బంధం
బలపడేన ఇప్పటికీ

నేను ఎరిగిన రోజే తెలిసింది
నీ పేరే ఫలాన అని

నిను విడినా రోజే తెలిసింది
ఈపిలుపే చివరిదాని

ఇప్పటికీ అనిపిస్తుంది
ఒంటరిగా వున్నప్పుడు
ఒరేయ్ అని పిలవాలని

మిత్రమా ఒరేయ్ తొ బంధమా. ..


********
వెలుమజాల నర్సింహ

9, జనవరి 2019, బుధవారం

అగ్నిశిఖ

ఆనందం కొందరిదే
ఆకలి చావులేందరివొ

భవనాలొ కొందరే
బస్తీ గుడిసెలలో ఎందరొ

చెరిగేన గీత మరేన తలరాత
చెక్కెన శిల్పని  అగ్నిశిఖ

******
ప్రసవ వేదన పడనిదే
ఫలితం విలువ తెలువదు

నిన్న రేపు తెలుపున
నీ భవిష్యత్తు
ఎదైనా ఇప్పుడె ఇక్కడే

మరణం మర్చేన నీబాట
మధనంలోంచి పుట్టెన అగ్నిశిఖ
*******

31, డిసెంబర్ 2018, సోమవారం

నుాతన సంవత్సరం@ 2019"



కాలగర్భంలో మరో సంవత్సరం
కానుకగా కొత్త సంవత్సరం

కాలంతోపాటు పయనం
కాదనా ఆగదు నీకోసం

కొత్త సంవత్సరం కొత్త కోరికలు
కొదవా లేని ఆశల తీరం

నడుస్తున్న కాలం మొబైల్ శకం
నడవదు నీకాలం ఆది చేతిలో లేనిదే

సామాజిక మాద్యమాల  జోరు
సాగేన రొజు వాటిలో హొరు

లెక్కకు తగ్గేనా  ఒక్క సంవత్సరం

మళ్ళీ మళ్లీ వచ్చేన కొత్త సంవత్సరం

మనీ, మనిషి కి వచ్చేన రెక్కలు

కాకుంటే మెదటి రోజే సుమా

ప్రపంచం మనుషులు వెతుకుతారు కొద్ది నిముషాలు
అదే హ్యాపీ న్యూఇయర్

✍నర్సింహ వెలమజాల

27, డిసెంబర్ 2018, గురువారం

జీవనయానం



గమ్యం తెలియాని పయనం
గతుకుల బతుకుల జీవనం
అయేమయంల చదువు
పయనం తెలియదు జీవనయానం

చిటపట చినుకుల వర్షం
చింతలతొ కుాడిన మనసు
నిద్రకు మించిన సుఖం
నిడివి  కల జీవనయానం

25, డిసెంబర్ 2018, మంగళవారం

ప్రభువే నీవని తలచి ("Jesus Christ ")



 ప్రభువే నీవని తలచి ప్రపంచమే
పండగ జరిపేన యేసేయా

యేసేయా మాదేవుడని
మానవులు కొలిచేన

కొలిచేన గుండెలో నిండుగా శిలువతొ

శిలువతొ శీరం పై ముల్ల కీరటంతొ

ముల్ల కీరటంతొ శాంతికి మార్గం చుాపుతు యేసేయా

యేసేయా మాదేవుడని కొలిచేదమా అను నిత్యం

24, డిసెంబర్ 2018, సోమవారం

జీవితం ×జీతం



జీవిగా పుట్టిన మనిషి , జీవితంలో మనుగడ కోసం జీతంతో సతమతమవుతు 'నిష"కు బానిసై జీవంలేని మనిషిగా 'మనీ కోసం ఆరాటమే జీవితం.

..నర్సింహ వెలుమజాల.

22, డిసెంబర్ 2018, శనివారం

మరణం తెలిపే నిమిషం


           
                                                                   

మరణం తెలిపే నిమిషం
మరో జన్మకు కానుక కాదా

 ఓటమి    తెలిపేనిమిషం
మరో అనుభవాన్నికి కానుక కాదా

మండే ఏండలే అనుకుంటే మబ్బుల 
మటున వానకు కానుక కాదా

పురిటినొప్పులమటున
పురుడుపోసుకొన
జీవే కానుక కాదా

కష్టం వెనుకా వచ్చే
ఆనందం మరో కానుక
కాదా

మరో జన్మ వుందో లేదో
తెలువని మనిషి

సంపాదన కోసం ఆరాటం మరో కానుక కాదా

నర్సింహ. వి

21, డిసెంబర్ 2018, శుక్రవారం

నీలో నీవు

నీలో లేని దాని గురించి భాధ పడడం కన్నా

 నీలో  వున్న  దానిని  అభివృద్ధి చెయ్యటం మిన్న
వెన. ....

నందా... నా మిత్రమా!" కథ

ఆ రోజు రేపల్లెలో సందడిగా, పండగ వాతావరణం నెలకొంది. వానలు కురిసి వెలియడంతో, గోవర్ధనగిరి పచ్చటి తివాచీ పరిచినట్లు, ఆకాశానికి సరికొత్త రంగులు అద...