23, మార్చి 2019, శనివారం

మనో నేత్రం



మనిషి పుట్టుక మరణం మనిషి చేతులలో లేదు .మానవ జాతి ఎంతో అభివృద్ధి చెందిన మానవ శరీరంలొ ఒక చిన్న  భాగం తయారు చేయలేక పొయ్యారు .

 భూమిని తల్లిగా, ఆకాశం ను తండ్రిగా బతికే జీవి నయనంద.

నయనంద పుట్టుకతో ఆంధుడు పైగా కన్నా వారెవరో తెలీదు.


ఊరు చివర పుారి గుడిసెలో జీవిస్తు,

 పంచభూతలను  బంధువులుగ భవించేవాడు.

నయనంద కు పాటే ప్రాణం ,మనసే గాయం

పతి మనిషి పుట్టుకకు ఎదొ అర్థం వున్నదని నమ్మే వాడు

పతి పండుగలు తన బంధువుల పెండ్లిలు
అనే వాడు ఎందుకంటే
కడుపు నిండ విందు భొజనాలు దొరుకుతాయి

ఎండగా వుంటే నాన్న కోపంతో వున్నాడని

వానకాలం వస్తే' వాన మామ" అమ్మ కు పచ్చని బట్టలు తెస్తాడు అంటుంటాడు' నయనంద.

ఊరులొ ఆహారం అడుకోవ్వడానికి పొతే

చరణ్ తన మిత్రులతో కలిసి నయనంద ను  గుడ్డివాడు వచ్చిండని ఏగతాళి చేసేవాడు .

నయనంద మనసులో గుడ్డివాడు అనగానే ఒక్కంత భాధగా వున్నా
ఏమి చేయలేనుగా అనుకునే వాడు .
చిరు నవ్వుతూ ముందుకు పొయ్యాడు .

"అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది
అనుకునే వాడు.


ఆది  "శ్రీ విళంబి నామ సంవత్సరం "2019 రాజకీయ పార్టీల చందాలతో  హోలీ సంబురాలు
ఎంతో సంతోషంగా జరుగుతున్నాయి.

చరణ్ తన మిత్రులతో
తగ్గినా మైకంలో

ఈరోజు రాత్రి నయనంద గాడి గుడిసె తగ్గుల పెట్టాలి గుడ్డొడి ఆట చుాడాలి అంటు నవ్వుకున్నారు.

హోలీ రొజు కావున
ఊరులొకి కొంచెం చీకటిలో పొతే అన్నం కుారలు దొరుకుతాయి అనుకుని
బయలు దేరాడు నయనంద.

అదే అదునుగా భవించిన చరణ్ తన మిత్రులతో వచ్చి నయనంద గుడిసెకు నీప్పు అటించాడు

గుడిసె కాలి బూడిదయిపోయింది.

ఉదయం వచ్చి చూసినా. ఊరి జనం కు వింత అనుభవం ఎదురైంది.

నయనంద కాలిన గుడిసె పక్క కు నిద్రపోతున్నాడు
లేపి అడిగితే  ,నాకు తెలుసు రాత్రి వచ్చేసరికి గుడిసె మండుతూ వుంది .

గొంతు చించుకొని అరచి మిమ్మల్ని భాధ పెట్టాడం
ఇష్టం లేక. ఇలా పడుకున్న ను అన్నాడు.

"సంతోషం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు ఆది నీలో మరియు నీతో నే వుంది.  దానికి కావలసింది "మనో నేత్రం"

వెలుమజాల నర్సింహ:

1 కామెంట్‌:

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...