28, డిసెంబర్ 2016, బుధవారం

తల్లిదండ్రులు భార్య – తనయు లాప్తులు యాయుష్య – మియ్యలేరు

.
 


 తల్లిదండ్రులు భార్య – తనయు లాప్తులు బావ
మఱదు లన్నలు మేన – మామగారు
ఘనముగా బంధువుల్ – గల్గినప్పటికైన
దాను దర్లగ వెంట – దగిలి రారు
యముని దూతలు ప్రాణ – మపగరించుక పోగ
మమతతో బోరాడి – మాన్పలేరు
బలగ మందఱు దుఃఖ – పడుట మాత్రమె కాని
యించుక యాయుష్య – మియ్యలేరు

తల్లిగర్భమునుండి – ధనము తే డెవ్వడు

 

   
సీ. తల్లిగర్భమునుండి – ధనము తే డెవ్వడు
వెళ్లిపోయెడినాడు – వెంటరాదు
లక్షాధికారైన – లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు – మ్రింగబోడు
విత్త మార్జనజేసి – విఱ్ఱవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము – తోడరాదు
పొందుగా మఱుగైన – భూమిలోపల బెట్టి
దానధర్మము లేక – దాచి దాచి
తే. తుదకు దొంగల కిత్తురో – దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా – తెరువరులకు?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

30, నవంబర్ 2016, బుధవారం

21, సెప్టెంబర్ 2016, బుధవారం

Narsimha Velumajala: అంబేడ్కర్ నడుస్తున్న చరిత్ర

Narsimha Velumajala: అంబేడ్కర్ నడుస్తున్న చరిత్ర: I అంబేడ్కరా ...  అంటరాని వారి ఇలవేల్ప బడుగుజీవుల బాగు పొరటవారథి  చరిత్రనె తిరగరాసిన యుగపురుష నడుస్తున్న చరిత్రకు..గీతాచార్యుని ...

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

అంబేడ్కర్ నడుస్తున్న చరిత్ర



I

అంబేడ్కరా ... అంటరాని వారి ఇలవేల్ప
బడుగుజీవుల బాగు పొరటవారథి
 చరిత్రనె తిరగరాసిన యుగపురుష
నడుస్తున్న చరిత్రకు..గీతాచార్యుని వలె...


II
  నీవు పడిన కష్టాలు నీవు చుసినఆగచాట్లు    ఆగ్రవర్ణల జాతిహంకరదోరణులు 
ముందు తరాల వారికిరావదని నీవురాసిన రాతలు
నడుస్తున్న చరిత్రకు..సాక్షధారలె ...
III

కుల మతధ్వేష వైరాని కలంతొ కల్చిన
 నీఅనుభవములెముందుతరాలవారికిభవితగా మీరు రాసినరాజ్యాంగం దేశాన్నికి గీతొపదేశంగా నడుస్తున్నచరిత్రకు..నీవుచిరస్మరణీయుడవులె... .


మీ...
నర్సింహ వెలుమజాల
తేది:14-4-2011


   ***  *** ***   ***


ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...