23, ఆగస్టు 2018, గురువారం

*ననంద. (నా మిత్రమా)




రేపల్లె లొ సందడిగా పండగ వాతావరణం వుంది, వర్ష లు పడడంతో  గొవర్థనగిరి పచ్చగా ఆకాశానికి రంగు వెసినటు కనిపిస్తుంది. 

 ననంద తన చద్ది ముాట భుజంకు వేసుకొని గొవులను గొవర్థనగిరికి  తొలుక పోవడానికి సిద్ధమయ్యాడు. తన కన్న చిన్నదైన  లతంగి 
నేను నీతో గొవర్థనగిరికి  వస్తానని మారాం చేస్తుంది.

వటపత్ర మరియు కుశంక తయారై 
కిట్టయ్య కోసం చుస్తునారు.

చేతిలో పిల్లనగ్రోవి మరొ చేతికి బంగారు కడియము తొ గోవుల ముందర  కిట్టయ్య నడుస్తున్నాడు. వారి వెనుక తక్కిన గోవులు ,ననంద మరియు గోపా బాలురు గొవర్థనగిరికి  వచ్చారు. 

ఎప్పుటి లాగే కిట్టయ్య గోవుల చుట్టూ కర్ర తొ గీతగీసి ఒక చెట్టు కింద కూర్చొని పిల్లనగ్రోవితొ వినసొంపుగా పాట పడుతుంటే గోవులు గీత లొపలుండి నేమరు వేస్తున్నాయి. కిట్టయ్య కు ఇష్టమైన ఆవు ,గొలక్ష్మి తన దుడేకు పాలు ఇస్తుంది.

తక్కిన గొపబాలులు మంద ముందర వుండే ఎండకు నిలబడి మేపు తున్నారు.

అలా కొని రోజులు గడిచాయి 

పతి దినం రావడం గొవుల చుట్టూ కర్ర తొ గీత గీయటం వేణువు తొ పాటలు పడడం గమనించినా ననంద. 

తన మంద చుట్టూ ననంద కర్ర తొ గీతగీసిన ఆవులు చిందరవందర పోతున్నాయి  .

కృష్ణుడి గీసిన కర్ర లతో గీసిన గోవులు గుంపుగా వుండడం లేదు. 
కొని రోజులు పాటు కర్ర లను జమచేసి వాటితో ననంద ఇంకా గోపా బాలురు తమ గొవుల చుట్టూ గీత గీసిన అవి చిందరవందరగా పోతున్నాయి. 

ననంద మరియు గోపా బాలురు అందరు  కృష్ణుడిని ఇలా అడిగారు
నీవు గీసిన గీత దాటడం లేదు కానీ మేము ఎన్నో సార్ల గీసిన వుండడం లేదు యేందుకని.


దానికి కిట్టయ్య మందహాసం తొ చిరునవ్వు నవ్వి 
చుాడు "ననంద నా మిత్రమా "పతి జీవికీ దేనికదే ప్రత్యేకం. 
ఇతరులను అనుకరించడం వారిలా  జీవించడం ఆసాద్యం 
ఇదే దుఃఖం కు కారణం. 
నీవు నీలాగే జీవించి చుాడు ఎంతో ఆనందం అని కిట్టయ్య చెప్పాడు. 

గొధుళీ వెలాయే యని గొవులతొ గోపా బాలురు ఇంటికి చేరారు. 
*****

మీ వెన...

Duppalli


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...