6, అక్టోబర్ 2018, శనివారం

బతుకమ్మ (దుప్పెల్లి)

1.పచ్చ పచ్చని పల్లెల మధ్య 

పచ్చిక బయళ్ళ పల్లెలలొన

పడమటి దిక్కున పచ్చని పల్లె 
పార్వతీపురం నొక్కటుండేను 

2జానకమ్మ  పుల్లయ్య పుణ్య దంపతులకు 

పుత్ర సంతానం లేక పుడమి పై మెుక్కని దైవం లేడు 

గౌడ వృత్తిని గౌరవంగా బావిస్తు 

బతుక సాగిరి ఆనందంగా 

3.తాటి వనంలో కంఠ మహేశ్వర 
ఆలయం నొక్కటి నిర్మించి  

ఆడవిలొ దొరికే తంగెడు గునుగు పువ్వులతో 

పుత్ర సంతానం కొసం పుాజలు చెసిరి 

4.వాన కాలం కు సెలవు చెబుతూ 
చలి కాలానికి  స్వాగతం పలుకుతూ

మంచు కురుసె  ఉదయం పుాట 

తాటి వనంకు బయలుదేరాడు పుల్లయ్య 

5.విరబుాసిన తంగెడు మధ్య 

వినిపించేన చిన్న  పాప శబ్ధం 

పాప కేరింతలు గమనించినా పుల్లయ్య

సంతానం లేని మాకు కులదైవం వరంగా బావించి  

పాపను ఇంటికి కొనిపోయే 

6.తలచిన దైవం కరుణించి 

మన బతుకన వెలుగు నింపుటకై
బతుకమ్మ గా ఇంటికి వచ్చానని 

జానకమ్మ ఆనందనికి
ఆవధులు లేవు బతుకమ్మ చుాసి

7.పెరుగుతూ వచ్చిన బతుకమ్మ కు 

పెళ్ళిడు వచ్చానని వరుడుని వేతక సాగిరి 

తంగెడు పువ్వులగా తలతల మెరిసేన బతుకమ్మ 

 పుత్తడి బొమ్మల కనిపించే బతుకమ్మ 

8.దసరా పండగకు మాసం ముందరా 

ఊరికి వచ్చేన కాలరా రోగం 

చెరువు కట్ట తెగి నష్టం కలిగేన 

ఊరుకు పటింది ఘతారని
గడ గడ వనికిర ఊరిజనం

9.డప్పు చాటింపు చెసిరి పెద్దలు 

బలి ఆడుగుతుంది అమెా ్మ రు తల్లి 

ఊరి లొ పెళ్ళిడు అమా ్మయులు 

ఇంటికి ని వదలి రావద్దన్నారు 

10.దసరా పదిరోజుల ముందరా 

ఊరి బాగు కోసం చెరువు లో దుాకి 

బలి గా మారెన బతుకమ్మ 

బాగు పడేన ఊరి జనం 
దేవత వెలసిన చెరువు గట్టు పై బతుకమ్మ 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...