28, అక్టోబర్ 2018, ఆదివారం

చివరకు మిగిలేది.👳‍♂(Life of knowledge)


దుప్పల్లి  ఊరిలొ వెంకటయ్య అనే జాలరి నివసిస్తున్నాడు కొంచెం మంద బుద్ధి తనంతొ పాటు చిలిపితనం వుండేది. ఊరిలొ అందరిని ఆట పటిస్తూవుండేవాడు.

రొజు ముాసినదికి చేపల వేటకు వేళ్ళడం సాయంత్రం ఇంటికి వచ్చి సైకిల్ పై ఊరంతా తిరగడం చేసేవాడు.

తన తండ్రి కాలం చేసినా నాటికి రెండు సంవత్సరాల బాలుడు అంటాది తల్లి రాధమ్మ .

ఐనా తన వృత్తిని నమ్ము కొనవాడికి అన్నం కరువుండదాని రాధమ్మ గట్టిగా నమ్ముతుంది.

*****
ఈ యేడాది కాలం ముందుగానే వచ్చింది
వర్షాలు బాగా కురువడంతొ చెరువులు కుంటలు నిండుకున్నాయి ముాసినది యేరు పుాసి పారుతుంది.

ఎంతో ఉబలటంతొ వున్న వెంకటయ్య పెందలకడ చేపల వేటకు బయలుదేరాడు.

యేరు పుాసి పారుతుంది వెంకటయ్య ఆశతో ఈదుకుంటు ఆవతల ఒడ్డుకు పొయి గంపెడు చేపలు పట్టిండు.

చేపలను చుాసిన వెంకటయ్య కు ఆనందం వేసింది. అన్ని మంచి చేపలే ,కొర్రమట్టలు, బొచ్చలే .

ఈరోజు నుండి నా దశ తిరిగింది నేను చాలా ధనవంతుడౌవుతాను.
అనుకుంటు యేరు దాటాలి కదా అనుకొని తెరుకొనాడు.


యేరు దాటి ఇంటికి పోవాలంటే చాలా సమయం పడుతుంది
చేపలు చనిపోతే ధర ఎక్కువ రాదు.


వెంకటయ్య గంపలొ సగం వరకు నీళ్ళు పోసి దానిలో చేపలు వేసి తలపై పెట్టుకొని యేరు ఈద సాగాడు.

ఒకొక్క చేప నీళ్ళ లో దుాకుతున్నయ్.

నీటి బరువుకు,యేరు శబ్ధంకు గమనించని
వెంకటయ్య ఊరు ఒడ్డుకు వచ్చి చూస్తే నీళ్ళు తప్ప చేపలు లేవు.

"కష్ట పడుట ముఖ్యం కాదు వచ్చిన అవకాశాని ఎలా ఉపయోగించవు అన్నది ముఖ్యం.

"వెన. ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...