3, నవంబర్ 2018, శనివారం

మట్టికి కులంయేక్కడిది ?


దుప్పల్లి గ్రామములో ఎల్లయ్య తన నలుగురు కొడుకులతో ఊరి పటేల్ రెడ్డి దగ్గర జీతం వున్నారు. ఎల్లయ్య బార్య నర్సమ్మ పటేల్ ఇంటి ఊడిగేం చేస్తుంది.

ఎల్లయ్య పెద్ద కొడుకు పొలం పనుల చూస్తే
తక్కిన ముగ్గురు ఆవుల మంద చుస్తుంటారు.

పచ్చని పైరులతొ మెుటా బావి పనులతో, ఆడవిలొ దొరికే తాటి పండ్లు మరియు దుంప గడ్డ లతొ కడుపు నింపుకుంటు వుండేవారు.

ఎల్లయ్య తన నలుగురు కొడుకులతో కలిసి భొజనం చేసేవాడు. నర్స మ్మకు తన భర్త సంసారం తప్ప మరెమి తెలువదు.
కానీ ముతైదువ తనాని దైవంగా  నమ్మినది  కాబట్టి నుదుట పెద్ద బొట్టు చేతులకు గాజులతొ వుండేది.

ఎల్లయ్యకు పటేల్ కు వయసులొ పెద్ద తేడా లేదు కాని ఎల్లిగా అని పిలుస్తువుండేవారు

ఎల్లయ్య తన నలుగురు కొడుకులను పిలిచి ఇలా అన్నా డు

రానున్న రోజులలో జనాభా పెరిగి మేడలు కట్టి పంటలు పండిస్తారు

మనిషికి విలువలు పడిపోతాయి.

తన కోసం అనుకంటే మనిషి కంచె వేస్తాడు.


*******
తెల్లవారు జామున ఎల్లయ్య పెద్ద కొడుకు పంటకు నీరు పెట్టడానికి వెళ్లుతు దారిలో త్రాచుపామును తొక్కేస్తాడు
పాముకాటు వేసింది దాని గమనించని అతడు
పొలంలో పనులు
 చూస్తుండగా

ఉదయమైయుంది రక్త ం గమనించినా తను
పాము కరిచింది అనుకొని ఇంటికి పొయి తన తండ్రి కి చూపించే.

త్రాచుపాము కరిచినటుల వుంది
అనుకొన ఎల్లయ్య వెంటనే మంత్రగాడైన దాసరి పిచ్చయ్య దగ్గరకు తీసుకు పొయే.

పరిస్తితి విషమించి
ఎల్లయ్య పెద్ద కొడుకు నోటి వెంట  నురగలు కారుతు చనిపోయాడు.

 ఎంతో భాధతొ రోదిస్తున్న ఎల్లయ్య ను పటేల్ రెడ్డి వారు చూడడానికి రాలేదు ఎందుకంటే తక్కువ కులం కాబట్టి. పైగా
తన భుాములలొ
శవాన్ని పాతి పెట్టొదు
అని ఊరి మసుకుారి తొ
కబురు పెట్టాడు.

పాపం తక్కువ కులంలో పుట్టడం శాపమా అని ఏడుస్తూ బంజారు భూమి లో దహనం చేశారు

మట్టిలో పుట్టి మట్టితిని మట్టిలో కలిపేసుకొనే
"మట్టికి కులంయేక్కడిది.
....
వెన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...