14, అక్టోబర్ 2018, ఆదివారం

ఆ"ఐదుగురు


దుప్పల్లి అనే  ఊరిలో  రామయ్య అనే పేద పుాజరి వుండేవాడు.
తన వృత్తిని దైవంగా బావించె వాడు. మనం పంచేంద్రియాలతొ 
జీవిస్తూ వాటిలో ఐక్యం కావలసిందే అని తన బాల్య మిత్రుడైన
 రసూల్  తొ అంటుండేవాడు. కులాలు వేరైన వారి స్నేహ
 ం కొనసాగుతూ వస్తుంది.


రసూల్ తన వృత్తియైన మాంస దుకాణం
 నిర్వహించేవాడు.రామయ్య తన యాచక వృత్తి తొ 
నలుగురిని నవ్విస్తు వుండేవాడు. రసూల్ చాలా కొపంతొ వుండేవాడు. 
 మనుషులు అవకాశవదులు వారికన్నా "అల్ల "నే 
నమ్ముకుంట అతడే సర్వ సం అనేవాడు.

రామయ్య కనీసం ఐదుగురు తొ నైనా మంచిగా 
వుండు అనేవాడు కానీ రసూల్ వినేవాడు కాదు.

 పిల్లలు ,సంసారం వంటివాని వేస్ట్

పేస్ట్ లాగా పోతుంది అనే వాడు

కానీ రామయ్య తన మిత్రుడి వింత 
చేష్టలకు దేవుడే కాపాడాలి అనే వాడు.

*********
ఒక రొజు ఉదయం రసూల్ రామయ్య ఇంటికి వచ్చి. 
.రామ్ బాయ్ ఆఐదుగురు అంటావు ఎవరు అన్నీ అడిగాడు.
దానికి రామయ్య తన మిత్రుడికి ఇప్పటికీ దేవుడు
 బుద్ధి ఇచ్చాడు అని ఇలా చెప్పసాగాడు.
ఆఐదుగురు అంటే నీవు" చనిపోయినపుడు 
నలుగురు నీను  మెుస్తె ఐదవవాడు
 నీ శవం ముందర నడిచి కర్మ కండ నిర్వహించేవాడు
 అని చెప్పగా.

అప్పటి నుండి రసూల్ అందరితొ 
కలసిమెలసి వుండేవాడు.


శుభొదయం Good Morning )


రవి తలుపు తెరెచెన
కిరణం విడిచేన
పక్షి ఆరిచేన పత్రం లేచేన
హిమం తొ పువ్వు సా ్ననంమడి
పురివిప్పెన
పంచభూతలు మరువవు
 "శుభొదయం"

13, అక్టోబర్ 2018, శనివారం

దసరా పండుగ

అమ్మలాంటి పల్లెలలో  సంబురాలు 
అచ్చు గుద్దిన పచ్చని చేనులతొ
బసవన్న రంకేలతొ 
అందమైన  పువ్వులతో 

కొత్త బట్టలతొ కొంగొత్తి ఆశలతో 

పాలపిట్టలతొ పడుచుల చప్పట్ల తొ 

పురాణాల గథాలను తలుచుకుంటూ 

నవరాత్రుల దేవి పూజ లతో 

దర్జీల చేతి నిండ పనితో 

పాఠశాలలాకు  సెలవులతొ 

పటాకుల చపుడుతొ

జమ్మి చెట్టు పుాజలతొ దసరా సంబురాలు 

పల్లెలలో  సంబురాలు అంబరాన్ని 
అంటేనా 

దసరా విజయాన్నిచ్చి 
విజయదశమిగా వెలుగు నింపేన 

*************

Velmajala Narsimha

10, అక్టోబర్ 2018, బుధవారం

బతుకమ్మ


పల్లవి:అడవి లో పుట్టిన గునుగామ్మ
ఆడవారి చేతులొ బతుకమ్మ 
బంగారు రంగులో 
తంగెడమ్మ
తల్లి కొడుకులంట మీ రామ్మ 

                 :అడవి లో పుట్టిన:


చరణం:పల్లె పాటలలో బతుకమ్మ 

తెలంగాణా తల్లి  మయామ్మ

రంగు రంగులో బతుకమ్మ 
మా ఇంటి ఇలవేలుపు నీవమ్మ

చరణం :బంతి పువ్వులంటి అక్కను 

              
నీ అక్కున చేర్చే వే బతుకమ్మ
తమ భాధను పాట రూపం లొ మార్చి 
పడుకుందురంట బతుకమ్మ.
          :అడవి లో పుట్టిన:
Narsimha.  V

9, అక్టోబర్ 2018, మంగళవారం

ఇగో ల రామాయ్య" (Ego not a mannerism is a foolishness)



పల్లవి:ఇగో ల రామాయ్య
నీ గోల ఎంటాయ్య

మా గోల మాదయ్య
నీ గోల ఎంటాయ్య

చరణం: ఉదయం లేవడం తోనే 

మాకు చేతిలో ఆండ్రాయుడ్  మొబైల్  కావాలి 

నెట్ లొ కొట్టి  వీడియోలు చుస్తామంటా 

సొల్లంత చూసేసి 
కళు నలుచుకుంటు లేస్తమంటా 

:ఇగో ల రామాయ్య: 

చరణం:సమయామే లేదంటూ 
పేసుబుక్ చాట్ చేస్తాం 

లైక్ లా షేర్ లతో లోకమే మాదేయంటాం

:ఇగో ల రామాయ్య: 

చరణం: మాకు ఆశయాలు లేవంటా 

మాకు లోకమే ఫొన్ నంటా 

:ఇగో ల రామాయ్య: 

నర్సింహ వెలుమజాల. ..

7, అక్టోబర్ 2018, ఆదివారం

ఆత్మ గౌరవం బతుకమ్మ .

ఆడవి పువ్వులు రాగి గిన్నె
పడతుల చేతి చపట్ల బతుకమ్మ
మన యాస మన ఆట మనపాట
తెలంగాణా ఆత్మ గౌరవం బతుకమ్మ
బతుకమ్మ అంటే భారత దేశం యొక్క పెద్దమ్మ

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...