11, ఆగస్టు 2018, శనివారం

"కిష్టయ్య హాస్పిటల్ "(ప్రాణ మిత్రులు)




అమెరికాలొ కాలిఫోర్నియా నగరంలో  రైన్బోస్ హాస్పిటల్ కార్డియలజిసుగా పనిచేస్తున్న డా:అమరేంద్ర కు పొన్ వచ్చింది ఫ్రెండ్‌షిప్‌డే శుభాకాంక్షలని దానికి సంతోషంగా  బదులిచ్చాడు పనిలో నిమగ్నమైతుండగ ఒకసారిగా తన ఊరు గుర్తుకొచ్చింది మనసు కలతచెందింది గుండె బరువెక్కింది ఎప్పుడొ వదిలేసిన పల్లె. 
*******
మా ఊరు దుప్పెల్లి ఇరువైపుల నాలుగు పచ్చని పిల్ల పల్లెలతొ వాటికి తల్లిలాంటింది మా ఊరు. తల మీద నీటి కుండ లాంటి  కొిత్త చెరువు దాని పక్క కు అంబాయ్ తొొట,దానికి అనుకొని వున్న విశాలమైన మల్లీభాయ్ కంచె. కంచెలొ మొదటిసారి చుాసింది కిష్టయ్య ను వాలా అయ్య  మల్లయ్య తొ. జేబు నిండి రేగు పళ్లు చేతిలో బలుసు పండు. నన్ను చూడగానే మల్లయ్య నమస్కారం దొర అనగానే కిష్టయ్య కుాడా బలుసు పండు కింద వేసి రెండు చేతులతో నమస్కారం అనగానే నా చేతులు కుాడా పైకి లేపి నమస్కారం చేసాను. "
సంస్కారం వున్న చోట నమస్కారం  తప్పక వుంటుంది "అప్పటి నుండి కిష్టయ్య కు నాకు యేదొ తేలియని బంధం ఏర్పాండింది. 
నేను కిష్టయ్య ఎన్నో సారుల జాతల బావిలో ఈత, ఫకీరు చింత కింద చిరగొని ఆట మేమిద్దరం అదే మా లోకం, కిష్టయ్య బొత్తల నుండి ముంజేలు కొసేవాడు. కాలం చాలా నేర్పరి నీకు నాకు చెప్పకుండా పరుగేడుతు ంది.పైచదువుల కొసం నాన్న నాను అమెరికా పంపించుడు. కిష్టయ్యను చూడకుండా దాదాపు నలబై  వసంతాలు అయుండొచ్చు. వెంటనే కిష్టయ్య ను చూడాలి తనివితీరా కౌగిలించుకొవాలి అనుకొని దుప్పెల్లి కి పయనమై వచ్చాను . ఊరు చాలా మరింది కాలం తొ పాటు కనుమరుగైన అనుబంధ లు. కిష్టయ్య ను చూడాలని ఉబలటంతొ. ఊరు లొ కిష్టయ్య గురించి అడిగాను .కిష్టయ్య గుండె పోటుతొ సంవత్సరం కిందట మరణించాడాని తెలిసింది.నేను షాకయను. ఏమిటి నా చిన్న నాటి మిత్ర డు మరణించాడా. ఆది కార్డియలజి తొ నే చదివిన చదువు వృధా. మనసు చాలా బాధిస్తుంది. పతి మనిషి కి ఎంతో మంది మిత్రులు  నా ,ఒక ప్రాణ మిత్ర డు వుంటాడు. ఆది నీ గుండె కే తెలుస్తుంది. కిష్టయ్య నా స్నేహం చిరకాలం వుండలంటే ఊరుకి ఏదైనా చేయాలి అనుకున్నను. మంచి 
హాస్పిటల్ " పెట్టి ఉచితంగా వైద్యం చేస్తూ మా స్నేహం గురించి పదిమందికి తెలిసేలా 
కిష్టయ్య హాస్పిటల్ "పెడతాను.. ఇదే కిష్టయ్య ఇచ్చే స్నేహం యేక కనుక. 

మీ..వెన. ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...