13, నవంబర్ 2018, మంగళవారం

నాతో నాన్న


అక్కడ పాఠశాల  పుార్వ విద్యార్థులు సభ జరుగుతుంది
 అక్కడ నాన్న పాతిక సంవత్సరాల పనిచేసి రిటైర్ 
అయిన పాఠశాల అందులో నేను ఒనమాలు నేర్చుకున్న  .
నాన్న తెలుగు టీచర్ పేరు రఘురామయ్య

సభకు చాలా మంది వచ్చారు నేను
 ఒక పక్కన  కుర్చీలో కుర్చున
  ఒకొక్క విద్యార్థి లేచి నాన్న గురించి 
చెబుతుంటే నా చిన్న నాటి విషయాలు 
గుర్తుకు వస్తున్నాయి.
 తెలుగు మాస్టర్ రఘురామయ్య వలన 
నేను తెలుగు పండిట్ అయినాను 
అని మరో విద్యార్థి పొగుడుతునారు.

నాన్న చిన్నపుడు చిటికన వేళ్ళును పట్టుకొని 
ఊరి లోకి పొతే
పంతులు గారి అబ్బాయి చిన్న పంతులు అచ్చంగ 
మాస్టర్ రఘురామయ్య లాగే వున్నాడు అనేవారు
నాకు చెల్లెలు సౌమ్యముఖి కి నాన్న గోరు ముద్దలు
 తినిపిస్తు ఎన్నో పదా ్య లు వినిపించేవారు.
నేను చెల్లెలు మారాం చేస్తె ఎన్నో కధలు చెప్పేవాడు

నాన్న నాకోసం, మా చదువులకు 
తన జీవితాన్ని ధార పోసిండు.

నాన్నకు ఇరవయ్యోట  అమ్మ వచ్చింది.
రెండు సంవత్సరాల తరువాత నేను పుట్టాను. 
నాకు ఇప్పుడు నలబై ఐదు కాని నాన్న
 కాలం చేసి ఆరు నెలలు అవుతున్నా
ఇప్పటికీ నాతో వున్నాడు. నాన్న 
ఇచ్చిన దేహంలో  "నాతో నాన్న"


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...