29, ఆగస్టు 2018, బుధవారం

నాపల్లె అందం

🌾 🌾


1.పచ్చటాకు పాడి ఆవు గొర్రెమంద గొల్లబామ్మ 


లేత చిగురు వగరుకాయ వాగు సొగసు
 చేప పులుసు

తుంగ దిబ్బ తుటి కుార 
గిజిగాడు
గండు తుమ్మెద 

నాపల్లె అందం చుాడతరమా  


2.చెరువు కట్ట 
తాత్త నొట్లొ చుాట్ట

సజ్జ చేను సాలె గుడు 
జొడి యేద్దు జొన్న చేను
 నాపల్లె అందం చుాడతరమా


3.ఈతకల్లు తాటి వనం 
రేగు పళ్లు రావిచెట్టు 

ఈత బావి రేల పువ్వు
నాపల్లె అందం చుాడతరమా

4.పచ్చని చేను పల్లె యాస 
కొడి కుాత కొరమీను 
ఊట చెలిమె ఉరగాయ

 నాపల్లె అందం చుాడతరమా

5.తాటి కల్లు 
తొడు చుట్టం 
కంచే రేగు కందికాయ 

వరుసలతో పిలుపు 
సరసమైన మనుషులు
 
నాపల్లె అందం చుాడతరమా

*** మీ వెన. .. Duppally

27, ఆగస్టు 2018, సోమవారం

*రక్షాబంధన్*



భగవంతుడు లేడు అనే వాడికి బలమైన సమాధానం 

బంధం బలమైనది అనడానికి నిలువెత్తు నిదర్శనం 

కన్న పేగు నుండి కాటిీ వరకు సాగే పయనం లొ 

అన్న చెల్ల ల అనుబంధం అజరామం 

అన్న తమ్ముడు బంధం నాభి నాలుక బంధం 

బంధలు ఎన్నో పండగ లు అని...

కానీ "రక్షాబంధన్ " అన్న చెల్లల రక్షణ అవసర బంధం

23, ఆగస్టు 2018, గురువారం

*ననంద. (నా మిత్రమా)




రేపల్లె లొ సందడిగా పండగ వాతావరణం వుంది, వర్ష లు పడడంతో  గొవర్థనగిరి పచ్చగా ఆకాశానికి రంగు వెసినటు కనిపిస్తుంది. 

 ననంద తన చద్ది ముాట భుజంకు వేసుకొని గొవులను గొవర్థనగిరికి  తొలుక పోవడానికి సిద్ధమయ్యాడు. తన కన్న చిన్నదైన  లతంగి 
నేను నీతో గొవర్థనగిరికి  వస్తానని మారాం చేస్తుంది.

వటపత్ర మరియు కుశంక తయారై 
కిట్టయ్య కోసం చుస్తునారు.

చేతిలో పిల్లనగ్రోవి మరొ చేతికి బంగారు కడియము తొ గోవుల ముందర  కిట్టయ్య నడుస్తున్నాడు. వారి వెనుక తక్కిన గోవులు ,ననంద మరియు గోపా బాలురు గొవర్థనగిరికి  వచ్చారు. 

ఎప్పుటి లాగే కిట్టయ్య గోవుల చుట్టూ కర్ర తొ గీతగీసి ఒక చెట్టు కింద కూర్చొని పిల్లనగ్రోవితొ వినసొంపుగా పాట పడుతుంటే గోవులు గీత లొపలుండి నేమరు వేస్తున్నాయి. కిట్టయ్య కు ఇష్టమైన ఆవు ,గొలక్ష్మి తన దుడేకు పాలు ఇస్తుంది.

తక్కిన గొపబాలులు మంద ముందర వుండే ఎండకు నిలబడి మేపు తున్నారు.

అలా కొని రోజులు గడిచాయి 

పతి దినం రావడం గొవుల చుట్టూ కర్ర తొ గీత గీయటం వేణువు తొ పాటలు పడడం గమనించినా ననంద. 

తన మంద చుట్టూ ననంద కర్ర తొ గీతగీసిన ఆవులు చిందరవందర పోతున్నాయి  .

కృష్ణుడి గీసిన కర్ర లతో గీసిన గోవులు గుంపుగా వుండడం లేదు. 
కొని రోజులు పాటు కర్ర లను జమచేసి వాటితో ననంద ఇంకా గోపా బాలురు తమ గొవుల చుట్టూ గీత గీసిన అవి చిందరవందరగా పోతున్నాయి. 

ననంద మరియు గోపా బాలురు అందరు  కృష్ణుడిని ఇలా అడిగారు
నీవు గీసిన గీత దాటడం లేదు కానీ మేము ఎన్నో సార్ల గీసిన వుండడం లేదు యేందుకని.


దానికి కిట్టయ్య మందహాసం తొ చిరునవ్వు నవ్వి 
చుాడు "ననంద నా మిత్రమా "పతి జీవికీ దేనికదే ప్రత్యేకం. 
ఇతరులను అనుకరించడం వారిలా  జీవించడం ఆసాద్యం 
ఇదే దుఃఖం కు కారణం. 
నీవు నీలాగే జీవించి చుాడు ఎంతో ఆనందం అని కిట్టయ్య చెప్పాడు. 

గొధుళీ వెలాయే యని గొవులతొ గోపా బాలురు ఇంటికి చేరారు. 
*****

మీ వెన...

Duppalli


21, ఆగస్టు 2018, మంగళవారం

కొంటే కొణంగి



జలజ తన భర్త తొ అమ్మగారింటికి సైకిల్ పై పోతుంది .
ఊరి చివర గొర్రెల మంద ఎదురొచింది 

జలజ: ఎవండి మీరు ఊరేలుతునరాని మీ అక్క చెల్లెలు  ఏదురు వస్తున్నారు 

జలజ అమ్మగారి ఊరి వచ్చింది. 

రెండు పందులు ఎదురొచినవి 
జలజ భర్త: జలజ మీ అన్న,తమ్ముడు నీ రాక కోసమే చుస్తునారు 
సైకిల్ దిగు. ..

18, ఆగస్టు 2018, శనివారం

మల్లీ బావి కంచెలొ ఆట.(Song-8) Duppelli Village


పల్లవి:మల్లీ బావి కంచెలొ ఆట. ...

మసీదు బండ పై పాట. ..
ఊరంతా గుమిగూడె చోట. ..
మాఊర్లొ బతుకమ్మ ఆట. ..


చరణం:గునుగు పువ్వుల బాట ..
తంగెడు పువ్వుల వేట. ..

తమ్ముడు శీను పాట 
తగిలే చలి ఉదయం పుాట. ..

                :మల్లీబావి:

చరణం: మసీదు బండ పై పాట. .
మదిదొచ్చెన్ ఊరి జనం నోట. .

ఊరి ఆడపడుచుల బతుకమ్మ ఆట 
తెలంగాణ తల్లి దీవెన ముాట. ...

                 :మల్లీబావి:

16, ఆగస్టు 2018, గురువారం

వందేమాతరం  చంద్రయ్య 🇮🇳

అనుకున్నవి అని జరగక, అనుకొనివి జరగడం వాటివల్ల సంతోషంతో  పాటు పేరు మారటం సహజంగా చుస్తుంటం. అలాంటి చిన్న సంఘటనే  ఈ కధ. ..

దుప్పెల్లి అనే గ్రామములో వడ్డెర పెంటయ్య దుర్గ మ్మ  కొడుకు చంద్రయ్య.మసీదు బండ వారి జీవనాధారం . బండలపై కడీలు,ఇంటి  రాళ్ళు పనులు  అదే లోకం. 
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

స్వాతంత్ర్య ఉద్యమ సయమం భగత్ సింగ్ ఉరి తొ, ఊరి ఊరులలొ యువతలలొ స్వాతంత్ర్య కాంక్ష  బలపడుతుంది .
నేతానలు ముాడు రంగుల జెండాలను ఉచితంగా ఊరంత పంచారు. 

వీధి ముల్ల లో జెండాలను పాతారు వందేమాతరం తొ ఊరంత దద్దరింలింది. 
కుల మత భేదాలు లేకుండ వందేమాతరం మరుమెుగింది. 
దానికి కోపించిన ఆంగ్లేయులపోలీసులు  పాతిన జెండాలను పికి మసీదు బండ పై తగులపెట్టాడానికి చుస్తుండగా గమనించిన వడ్డెర చంద్రయ్య
 పక్కనున్ను తన గూడెం మనుషులను తీసుకోచి ఆంగ్లేయులపోలీసులపై
దాడికి దిగారు. వడ్డెర జాతి దెబ్బ కు తట్టుకోలేక జెండాలను విడిచి పారిపోయారు. 
జెండాలను తీసుకోని చంద్రయ్యవారి గుండెం లో పతి గుడిసె ముందర జెండాలను పాతారు.ఈ విషయం తెలిసిన ఊరు జనం వడ్డెర చంద్రయ్య ను వారి దైర్యం కు 
మేచ్చి  వందేమాతరం చంద్రయ్య గా పిలుచుకున్న రు.

వందేమాతరం



వంద గొంతుకల నినాదం  వందేమాతరం 

ఎన్నో గొంతుల బలిదానం స్వాతంత్రం  

రాజకీయ చదరంగం నాడు వుంది నేడు వుంది

 బలైపోతున మధ్యతరగతి మనుషులు ఎప్పుడూ మేకలే. ....

ఇంట్లో తిండికి వుండదు చేతితో డిజిటల్ పోన్ 

చదవడానికి ఎన్నో వసతులు చదివే పిల్లలేరు

పచ్చాతి సంస్కృతి పడేసేన్ నిన్ను పాతాళానికి 

స్వాతంత్రంి అంటే నేట్ లో వెతికి సంబార పడుతుంది నేటి యువత 

వందేమాతరంటే అలసట అనుకొని వదిలేసిన నేటి యువత.
మీ వెన. ..

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...