10, అక్టోబర్ 2018, బుధవారం

బతుకమ్మ


పల్లవి:అడవి లో పుట్టిన గునుగామ్మ
ఆడవారి చేతులొ బతుకమ్మ 
బంగారు రంగులో 
తంగెడమ్మ
తల్లి కొడుకులంట మీ రామ్మ 

                 :అడవి లో పుట్టిన:


చరణం:పల్లె పాటలలో బతుకమ్మ 

తెలంగాణా తల్లి  మయామ్మ

రంగు రంగులో బతుకమ్మ 
మా ఇంటి ఇలవేలుపు నీవమ్మ

చరణం :బంతి పువ్వులంటి అక్కను 

              
నీ అక్కున చేర్చే వే బతుకమ్మ
తమ భాధను పాట రూపం లొ మార్చి 
పడుకుందురంట బతుకమ్మ.
          :అడవి లో పుట్టిన:
Narsimha.  V

9, అక్టోబర్ 2018, మంగళవారం

ఇగో ల రామాయ్య" (Ego not a mannerism is a foolishness)



పల్లవి:ఇగో ల రామాయ్య
నీ గోల ఎంటాయ్య

మా గోల మాదయ్య
నీ గోల ఎంటాయ్య

చరణం: ఉదయం లేవడం తోనే 

మాకు చేతిలో ఆండ్రాయుడ్  మొబైల్  కావాలి 

నెట్ లొ కొట్టి  వీడియోలు చుస్తామంటా 

సొల్లంత చూసేసి 
కళు నలుచుకుంటు లేస్తమంటా 

:ఇగో ల రామాయ్య: 

చరణం:సమయామే లేదంటూ 
పేసుబుక్ చాట్ చేస్తాం 

లైక్ లా షేర్ లతో లోకమే మాదేయంటాం

:ఇగో ల రామాయ్య: 

చరణం: మాకు ఆశయాలు లేవంటా 

మాకు లోకమే ఫొన్ నంటా 

:ఇగో ల రామాయ్య: 

నర్సింహ వెలుమజాల. ..

7, అక్టోబర్ 2018, ఆదివారం

ఆత్మ గౌరవం బతుకమ్మ .

ఆడవి పువ్వులు రాగి గిన్నె
పడతుల చేతి చపట్ల బతుకమ్మ
మన యాస మన ఆట మనపాట
తెలంగాణా ఆత్మ గౌరవం బతుకమ్మ
బతుకమ్మ అంటే భారత దేశం యొక్క పెద్దమ్మ

ఎదైనా కొద్ది కాలమే


ఎదైనా కొద్ది కాలమే
పుట్టుక దాని ఆనందం
ఎదైనా కొద్ది కాలమే
మంచియైన చెడుయైన

ఎదైనా కొద్ది కాలమే
 కష్టమైన సుఖమైన

ఎదైనా కొద్ది కాలమే
యవ్వనం దాని ప్రభావం

ఎదైనా కొద్ది కాలమే
ధనమైన దాని విలువైన

ఎదైనా కొద్ది కాలమే
సంసారం బంధువులు

ఎదైనా కొద్ది కాలమే
కాలం చేసినా గాయలు

ఎదైనా కొద్ది కాలమే
ఆశాయైన నిరాశయైన

ఎదైనా కొద్ది కాలమే
మరణమైన దాని భాధయైన




Velumajala Narsimha. Duppelli. ..

6, అక్టోబర్ 2018, శనివారం

బతుకమ్మ (దుప్పెల్లి)

1.పచ్చ పచ్చని పల్లెల మధ్య 

పచ్చిక బయళ్ళ పల్లెలలొన

పడమటి దిక్కున పచ్చని పల్లె 
పార్వతీపురం నొక్కటుండేను 

2జానకమ్మ  పుల్లయ్య పుణ్య దంపతులకు 

పుత్ర సంతానం లేక పుడమి పై మెుక్కని దైవం లేడు 

గౌడ వృత్తిని గౌరవంగా బావిస్తు 

బతుక సాగిరి ఆనందంగా 

3.తాటి వనంలో కంఠ మహేశ్వర 
ఆలయం నొక్కటి నిర్మించి  

ఆడవిలొ దొరికే తంగెడు గునుగు పువ్వులతో 

పుత్ర సంతానం కొసం పుాజలు చెసిరి 

4.వాన కాలం కు సెలవు చెబుతూ 
చలి కాలానికి  స్వాగతం పలుకుతూ

మంచు కురుసె  ఉదయం పుాట 

తాటి వనంకు బయలుదేరాడు పుల్లయ్య 

5.విరబుాసిన తంగెడు మధ్య 

వినిపించేన చిన్న  పాప శబ్ధం 

పాప కేరింతలు గమనించినా పుల్లయ్య

సంతానం లేని మాకు కులదైవం వరంగా బావించి  

పాపను ఇంటికి కొనిపోయే 

6.తలచిన దైవం కరుణించి 

మన బతుకన వెలుగు నింపుటకై
బతుకమ్మ గా ఇంటికి వచ్చానని 

జానకమ్మ ఆనందనికి
ఆవధులు లేవు బతుకమ్మ చుాసి

7.పెరుగుతూ వచ్చిన బతుకమ్మ కు 

పెళ్ళిడు వచ్చానని వరుడుని వేతక సాగిరి 

తంగెడు పువ్వులగా తలతల మెరిసేన బతుకమ్మ 

 పుత్తడి బొమ్మల కనిపించే బతుకమ్మ 

8.దసరా పండగకు మాసం ముందరా 

ఊరికి వచ్చేన కాలరా రోగం 

చెరువు కట్ట తెగి నష్టం కలిగేన 

ఊరుకు పటింది ఘతారని
గడ గడ వనికిర ఊరిజనం

9.డప్పు చాటింపు చెసిరి పెద్దలు 

బలి ఆడుగుతుంది అమెా ్మ రు తల్లి 

ఊరి లొ పెళ్ళిడు అమా ్మయులు 

ఇంటికి ని వదలి రావద్దన్నారు 

10.దసరా పదిరోజుల ముందరా 

ఊరి బాగు కోసం చెరువు లో దుాకి 

బలి గా మారెన బతుకమ్మ 

బాగు పడేన ఊరి జనం 
దేవత వెలసిన చెరువు గట్టు పై బతుకమ్మ 





5, అక్టోబర్ 2018, శుక్రవారం

భార్య Wif

బలపం పట్టింది పుట్టిన చోట 
బతుక నేర్చేన మరో చోట
 బంధం పెనవేసుకొన చోట
బంగారు బాట వేసేన ఆచోట 
తాళి తో ఆలి యైన చోట
తలవంచుక బతుకు  కదా ఈ చోట
పతియే తన భరొస యైన చోట
పట్టు విడువక వుండున ఈ చోట 
కట్నం తో వచ్చిన ఈ చోట 
కలసి నడవద కడదాక 
కష్టం నష్టం భరిస్తు నే 
కాపురం చేసేన ఈచోట 
సంతానం తో సంతృప్తి చెంది 
స్వర్గం పొందేన ఈచోట 





4, అక్టోబర్ 2018, గురువారం

ఐలవ్ యు 'టీచర్ " ILove U teacher Comic Story



దినియామ్మ పంతులు జీవితం "
పత్తి చేను వేసుకొన వాడి  జీవితం బాగుంది.
 నేను ఏమిటి మంజుల టీచర్ కు ఐలవ్ యు చెప్పడం.

 నాబట్ట తల రాత ఏమిటి? 

మాఆవిడ అటుంటుంది' తలమీద బొచ్చు
 లేనొడికి బోలెడు మంది లవర్స్ అని. 

అనట్లు మాఊరు దుప్పల్లి. ఊరి మీద
 మమకారంతొ సొంత ఊరిలొ తెలుగు టీచర్ గా పని చేస్తున్నా. 

మంజుల ఇంగ్లీష్ టీచర్. 

సొంత ఊరు మమకారంతొ  ఏడవ తరగతి
 మెుదటి టీచర్ గా పనిచేసే అవకాశం తీసుకున. 

ఈ వేదవలు నా పరువు తీసుకపొయు 
చెరువు లొ కలిపారు. 
వీళ్ల తలమీద తాటికాయ తగలేయ. 

నెక్స్ట్ పిరియడ్ ఇంగ్లీష్. 

 మంజుల టీచర్ .

యునిట్ టెస్టుల సమయం .

మేడమ్ తో నాలింక్ ఏమిటి. 

మేడమ్ "తల్లిదండ్రులు లేదా టీచర్ గురించి 
ప్రేమను తెలియజేస్తు  వా ్య సం రాయమంటే 
తలమీద మీద తాటికాయ పెట్టుకు తిరిగే వేదవలు 
ఏకంగా ఐలవ్ యు 'టీచర్ అని రాయడం ఏమిటి. 
మంజుల టీచర్ నాకు తెచ్చి ఇవడం
 మేము నవ్వు కొని దాని మలిచి నేను జేబులో వేసుకోవడం
 నా మతిమరపుని మంగకాయ తో కొట్టా. 

నాభార్య వనజ చుాడడం, బట్టతల పై బొప్పి వచ్చెల కొట్టడం 
నేను జాండ్ బామ్ జేబులో వేసుకోని పోవడం జరిగింది. 

"విధి ఆడిన వింత నాటకం లొ
 ఎవరొ వేసిన రాళ్ళు నాకే తాగిలాయ్. 


 

*గాంధీ పుట్టిన రోజంటా * song-13



పల్లవి : గాంధీ పుట్టిన రోజంటా 
సెలవు వచ్చేను 
శుభ దినమంటా 

భారత మాతకు ముద్దు బిడ్డంటా

దేశ బాపూగా ఎదిగిన నేతంటా 

చరణం:బొసి నవ్వుల తాతంటా
బొమ్మగ వచ్చేను నొట్ంటా
మన ఉప్పు కోసం పోరాటం 
ఉప్పు సత్యాగ్రహం చేసేనంట 

:గాంధీ పుట్టిన:

చరణం: బొసి నవ్వుతో బాపూజీ 
తరిమి కొట్టేన తెల్లోడిని 

భారత ప్రజలకు బాపూ యై 
బంగారు బాటలు వేసేనంట 

:గాంధీ పుట్టిన:

వెన. ..దుప్పల్లి. ..

చికెనుముక్క



వారం రోజులు కుారగాయలు 

వారం మధ్యలొ వంకాయ 

వారం చివర చింత పులుసు

వరుసగా వండి కుారగాయలు 

వంకర పొయేన ముాతి 
కంచం చెసెన పాచి



వచ్చేను వచ్చేను ఆదివారం 

చికెనుముక్క పై చెయ్యగ వంట 

మసాల దినుసులు తయారు చేసే 

ఆల్లం ముద్ద కారం చూసి 
ఆంగడకి  వచ్చి చికెను తెచ్చి 
ఆహా...ఒహొ మని ఆరగించెదమా 

చికెనుముక్క యని తోటి వారికి చెపుదామా 

Narsimha. Duppelli

1, అక్టోబర్ 2018, సోమవారం

కంచె బంతి song. 12

పల్లవి: సుారుటాకు నీళ్ళని సుటాకులొ పట్టి
కాలి అందెల చప్పుడు 
గణ గణ మేుగంగా 

చినుకు చినుకుల మధ్య
 రవి మెరుపులవస్తు

కంటికే కైపెక్కునా
కంచె బంతి 

నీను కన్నావారు మురిసిపోగా కంచె బంతి

       :సుారుటాకు:

చరణం:చెవిపోగు కింద చినుకు 
నీ చెంప నే ముద్దడా 

గుడిసెమీది గొల్లభామ 
వానాకు గొల గొల చేయంగా

గిజిగాడు గొంతు చించుక పాట నే పాడగా 

వాన లో మయురం కంచె బంతి 
నీ సరి జొడుగ నాట్య మడేన కంచె బంతి 

     :సుారుటాకు:


చికెనుముక్క*


వారం రోజులు కుారగాయలు 
వారం మధ్యలొ వంకాయ 
వారం చివర చింత పులుసు
వరుసగా వండి కుారగాయలు 
వంకర పొయేన ముాతి 
కంచం చెసెన పాచి
వచ్చేను వచ్చేను ఆదివారం 
చికెనుముక్క పై చెయ్యగ వంట 
మసాల దినుసులు తయారు చేసే 
ఆల్లం ముద్ద కారం చూసి 
ఆంగడకి  వచ్చి చికెను తెచ్చి 
ఆహా...ఒహొ మని ఆరగించెదమా 
చికెనుముక్క యని తోటి వారికి చెపుదామా 

Narsimha. Duppelli

*పంచేంద్రియాలు*


నీఆరొగ్యం బాగుంటే నీసంపాదన ఐదు  వందలుంటే ఎంతో మిన్న

 నీఆరొగ్యం బాగులేకుంటే ఐదు కోట్లు లునా సున్న.

26, సెప్టెంబర్ 2018, బుధవారం

Song- 11(మనిషి - దేవుడా)



పల్లవి:మనిషి చెక్కిన రాయిరా 
మన మధ్య దేవుడైయేరా 

బండరాయి గుండెరా 
మన గుండె భాధ కనడేందిరా 

:మనిషి చెక్కిన :
"
చరణం:కులానికి కొక దేవుడా కుాడు లేక జీవుడా 
పుట్టి చచ్చే మనుషుడ ఆశ చవని జీవుడా 

తల్లి కడుపులో జీవిరా తను కొచ్చి తల్లిని మరిచెన 
నీతి లేని జీవుడా గీత పటుకు తీరిగేన 

:మనిషి చెక్కిన :

చరణం:దేవుడాని జంతు బలి ఇచ్చేన 
పచ్చి రక్తం తాగేన 

పరుల కొసం సేవా అని 
పరలోక బాటాని చెప్పున

కంటికి కనబడని దేవుని కోసం 
కాలమే వృద్ధ చేసేన 

:మనిషి చెక్కిన :

చరణం :తల్లిదండ్రులను మరిచెన 
గుళ్లు గోపురాలు తీరిగేన 
ప్రకృతి ఒక దేవుడాని పరమ సత్యం మరిచెన 
తనఆత్మ యందే ఇమిడివుండే దేవుడిని 
కనడేందిరా. 

:మనిషి చెక్కిన :

Narsimha. V

* శ్రీ శ్రీ యేంకటేశం*

అప్పుడు రెండవ తరగతి  తాటాకుల బడి. 
 చెక్క పలకతొ యేంకటేశం వారి తాత వెనుకాల నుండి తరగతి లొ భయంతొ వస్తున్నాడు. పెద్ద బొట్టు జబ్బల లాగు పలకకు పుాజ చేసినట్టుండు వీడి "దుంప నరక"మా అల్లరికి అంతే లేదు. వాడి పలక పై శ్రీ శ్రీ యేంకటేశం రాసుంది.
జేబులో పెద్ద బలపం తొ వచ్చిన వాడు వాలా తాత ని కుర్చొమనాడు తరగతి లొ. అలా కొన్ని రోజులు గడిచినా తరువాత యేంకటేశం తన వెంట సంచిలో సర్వ అప్ప తెచ్చి బలపంకి అమ్మడం, చిన్న రొట్టె ముక్కలు తెచ్చి గొట్టీలకు అమ్మడం చేసెడు "వీడి రొట్టె విరిగి నేతిలో పడవేయా".రేగు పళ్లు, చింత కాయలు తెచ్చి అమ్మేవాడు. "వాడి ఐడియా లకు పిండం  పెట్టా" 
కబడ్డీ చేత కాదు కట్టలుగ ఉపాయాలు చేపేవాడు .

అలా చాలా సరదాగా సాగే మాతరగతి లొ చదువు కుడా మంచిగా సాగేది. ....

కొన్ని రొజుల తరువాత చదువు మధ్యలొ ఆపేసి 
 పాల వా ్య పారం మెుదలేెటాడు వాడి గుండు కొరగ. చదువు సున్న .పని చేసుకొంటే డబ్బు సంపాదించ వచ్చు అని అనేవాడు 

పాలు అమ్మటానికి పేందలాడే లేవడం  మద్యాహ్నమో పడుకోవడం వాడి పని 

అలా కొన్ని రోజులు తరువాత పెండ్లి చేసుకొని జీవన సాగిస్తూనాడు, కాని వాడి దుంప దెగ నొటి దుల చాలా ఎక్కువైనది 
"పిల్లికి బిచ్చం వేయాని పిసినారి వేంకటేశం.
ఊరికెనే వుంటే బోర్ ఊరు విషయాలు కేలికితే మాజా అని పతివాడిని కేలికివాడు పింజరి వేదవ.
******** 
ఎప్పటిలాగే ఈరోజు వేకువ జామున యేంకటేశం పాలను ఆటో లొ తీసుకోని సిటీకి బయలుదేరాడు. 
మార్గ మద్య లొ చిన్న ప్రమాదం జరిగి హాస్పిటలొ చేరాడు. 
హాస్పిటల్ తన స్నేహితుడిదే. 

******
వేంకటేశం తన గురించి తెలుసుకోవాలనుకున్నాడు.
డాక్టర్ తొ తను చనిపోయడాని అబద్దం చెప్పామనాడు. 

డాక్టర్ అలాగే చేసాడు. యేంకటేశం ఊరికి కబురు పంపించాడు. 
ఊరు వాళ్లు వచ్చి
కొందరు బాగా చచ్చిండు అంటే కొందరు విడి పిడా పొయిందాని తన బార్య వచ్చి ఎప్పుడు శవం ఇస్తారాని డాక్టర్ని  అడుగుతుంది. ఎవరైనా తన గురించి మంచిగా మాట్లాడుకోవడం లేదని గమనించినా వేంకటేశం. 
ఒకసారి కనులు తెరచి 
నాకు బుద్ధి వచ్చింది. 
ఇప్పటి నుండి ఎవరిని వెటకారం చెయ్యను. "వీలైతే సహయపడుతానాని చెప్పాగానే అందరు ఒకేసారి నవ్వి ఎంతైన మన వేంకటేశం "శ్రీ శ్రీ యేంకటేశమేరా. ..అన్నారు. ..

VNH. ..Duppelli

24, సెప్టెంబర్ 2018, సోమవారం

*బస్తీ లో బతుకు బండి *




సోమవారం ఐదవ తేదీ 
పాగరపనీ పడేరొజు 

పాత చొక్కా ఇస్తీరి చేసి 
పైపైన సెంట్ చల్లి 

గరీబీ తనానికి గంధం  పుాసి 

బస్ లో ఆఫీస్ కు బయలుదేరేన బస్తీ జీవి 

నెల కొచ్చె జీతం చాలక 
జీవితంలో  సతమతమావిక 

కష్టని కడుపు లో దాచి 
అమ్మ నాన్న ల ఊరిలొ విడిచి 
చిన్ననాటి దొస్తులను విడిచి 
చదివిన చదువుల సామర్థ్యం లేక

బస్తీలొ బతుకు సాగేన పల్లె జీవి 

నేల విడిచిన సాము వలె
కల చెదిరెన కధ మారెన
 
ఉరుకుల పరుగుల
బస్తీ జీవనం లో 

వచ్చిన జీతంతో బస్తీ వదలకపోవున 

ధనవంతులతొ పొటీ పడకనే 
నౌకరు జీతంతో నటిస్తూ

బస్తీ లో బతుకు బండి"లాగుతున్నాడు 

మీ. వెన

20, సెప్టెంబర్ 2018, గురువారం

నేను


భూమికి చినుకే బిడ్డయైతే 
వాన రాక కొసం ఎదురుచుాడదా
నీ కోసం "నేను" ఐతే నీలో ఆహం పెరిగేన 
కనిపంచేదంతా మిధ్య 
అనుకుంటే కోర్కెల గుర్రం ఆగున 
శమజీవికి దరిద్రం చెల్లెలుగా వెంటుడున 
అబద్దం ఆటలతొ జీవనమే సాగున 
మరుగున పడిన విషయాలు 
మధనంలోంచి బుర్రకేకి
ఆధొగతిలొ పడవేయదా 
చీకటిలాంటి కోపంతో పగతొ రగిలేవ 


యాదమ్మ -కల *


పూర్వం దుప్పెల్లి అనే గ్రామములో  చెరువు కట్ట పనులు జరుగుతున్నాయి .ఊరి దొరగారు పనులు చుసుకొవడనికి రంగయ్య అనే చదువు కున మనిషి నియమించాడు. 
రంగయ్య కట్ట పనులకొసం బస్తీ నుండి మనుషులను తొడు కొచ్చాడు. 

వారిలో యాదమ్మ అనే యుక్త వయసు గల అమ్మాయి వారి తాతతొ కలిసి వచ్చింది. 

తాతతొ యాదమ్మ ఇలా. ...
తాత అబద్దం ఆడని మనుషులుంటార 

వుండరు తల్లి .

తాత మరణం తప్పదని తెలిసిన మనుషుల ఆశ చావదు కాదు 

ఆవునమా. 

తాత యాదమ్మని. ...
ఈ నీతి సూత్రాలు మన కడుపు నీంపావు తల్లి .

నీ పెండ్లి చెసి ఒక ్అయ్య  చెత్తిలొపెట్టి 
నేను కన్ను ముస్త తల్లి. 

ఎప్పుడు నాపెండ్లి గురించి దిగులు పడుతావ్ తాత ఎందుకు?

చుాడు తల్లి. ....

పుట్టినప్పుడు అందరు నవ్వుతారు అది నీవు  గమనించిలేవు 
చచ్చినపుడు అందరూ ఏడుస్తారు అది నీవు చుాడలేవు నీకంటు ఆనందం పొందేది పెళ్ళి ఒకటే తల్లి. .....

మధ్యలో వెంకన్న కలుగజేస్తూకొని నిజమే తాత. 
కాని తెలంగాణా దేవుడు  యాదగిరి నృసింహ స్వామి వరాలతొ పుట్టింది యాదమ్మ ఏమి బాధ పడకు తాత 
అంతా మంచే జరుగుతుంది. 

కాలం కలసిరాదు ఆగదు కుడా కాలంతో నీపయనం. 
***********
కట్ట పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి పేందలాడే దొర గారు వచ్చి చుసి పొయారు. 

తొర్ర చింత కాడ వంట 
తొట్ల వుండడం. ..
......
ఇది అంతా గమనించినా దొర. ...
తాత నీవు ఈవయసు లో కుడా కష్ట పడడం ఏమిటీ.

దానికి తాత ఎంతో భాధతొ ఇలా ుఅన్నాడు 

్అయ్య మాది బస్తీకి దగ్గర వున్నా
 రామా పురం నాకు నలబై ఎకరాల మాగాణి వుండేది.నాకొడుకు కొడలు పనిమిద ఊరికి బయలుదేరారు బస్సు ప్రమాదంలో కాలం చేసారు. 

ఆస్తిులని కరిగి పొయ్యయ్ దానికనా  నా మనువడు రఘు చెసిన మెాసం గుండె తరుకు పోతుంది. ...

దొర. ...
తాత నీకు మనువడు కుడావుండ. ..

ఆ.... దొర 
వాలా అమ్మ నాన్న పొయాక రఘు వున్నా పొలం ఆమ్ముకొని డాక్టర్ చదువు చదువుతానని ఆమెరికా పొయే తిరిగి రాడయే. 

యాదమ్మ  తన తమ్ముడు వస్తాడు ఊరిలొ అమ్మ నాన్న
పేరు మీద దవఖాన పెడు తాడాని కలలు కంటుంది.

"గడ్డివాములొ సుాది పడవేసి వెతికినాట్లయే మా బతుకులు అని తాత వాపోయారు. 

మీ వెన. ......

గుడ్ మార్నింగ్

🌄 🌅

ఆకు మీద మంచు బిందు ఆగనంటుంది

గుాడులొని పక్షి పిల్ల గురక విడి నానది

గడ్డి చామంతి పువ్వు లేమే తల గగనం పై చూస్తున్నవి

పొద్దుతిరుగుడు పువ్వు లేమే ముద్దు కొసం చూస్తున్నవి

నీటి లొని చేప పిల్ల నాట్యం చేస్తున్నది

ఉషొదయం కావాలన్నది

అని తెలిసిన మనిషిమెు
పది గంటలకు లేస్తా నంటాడు
గుడ్ మార్నింగ్ చెప్త నంటాడు.
Attachments area

18, సెప్టెంబర్ 2018, మంగళవారం

కులగజ్జి

అంతెేలే పేదలు
నాడు నేడు బలైతునా   మనుషులు

కులం పేరుతో మతం పేరుతో
మానవత్వం మరిచి

బలిసిన నాలంచ కొడుకులు

వేట కొడవలి తొ చంపడమా

అంతెేలే పేదలు రాజకీయ చదరంగం పావులు

.ఇంకాన ఇకపై సాగదు
కులమతా వర్గ పొరు

మాదిగ మాల మనుషులుకార

చదివిన చదువులు మట్టి గొడలకే పరిమితమా

ఇంకాన ఇకపై సాగునా
పేదల పై బలిసిన వాడి పెత్తనం

.రాజకీయ రంగు
Tv...TRP హంగు

సిగ్గులేని జనం కులం పేరుతో చచ్చే మూర్ఖలు

కడుపుతొ వున్నాదాని
కనికరం లేని కసాయి వాలం

రాజకీయ స్మశానం లో నేటికీ కాలుతోంది కుల శవం

Velmajala Narsimha

15, సెప్టెంబర్ 2018, శనివారం

మొబైల్ జీవితం*



నిలచివుంటె చేతిలో 
నడుస్తుంటే జేబులో 

పడుకుంటే పక్కలొ 
ఒంటరిగావుంటే గేమ్స్ తొ

సమయంవుంటే చాటింగ్ తొ 
రోజంతా బాత్ఖనీ తొ

నీవులేని జీవితం నిమిషామైన శున్యం

పొద్దున్నే నీ ముఖం చుస్తు లేస్తాం 

రాత్రిదాక నీను చుస్తుంటే నిద్ర రాక చస్తాం

ఎక్కడవున పక్కనే నీవు 
మనిషికి మనిషికి  మాటలేవ్ 

కర్ణ పిశాచమా కాలం నీదే సుమా 
దృశ్య పిశాచమా జగత్త్ నువ్వే సుమా 

మీ వెన. .....

14, సెప్టెంబర్ 2018, శుక్రవారం

వక్రతుండ వన్స్ మెుర్***

*

దుప్పెల్లి అనే  గ్రామములో గణేష్ తన మామ రాము 
ఇంటికి వినాయక చవితిని పురస్కరించుకొని వస్తున్నాడు.

...మామ ...మామ. ..గణేష్ అని  వినాయకుడాని ఎందుకంటారు.

మామ నవ్వి నీ లైట్ వెలిగినటుందిరొయ్.

మీ అమ్మ నన్ను తమ్ముడు లేదా చిన్న అని పిలుస్తుంది .

గణేష్డు కి వక్రతుండ అని
గజణాన ,ఏకాదంతయాని పిలుస్తారు .పేరులో ఏమిలేదు 
అల్లుడు మంచితనం వుంటే చాలు.

బైక్ పచ్చని పొలాల మధ్య లొ పిల్ల బాటల గుండా వెేడుతుంది.

చుట్టూ పక్క ల గ్రామములలో భజన పాటలు వినసొంపుగా వినబడుతున్నయ్

గణేష్ బైక్ పై కూర్చొని అటు ఇటు వుగుతునాడు.

దాని గమనించినా మామ. ....

గణేష్ కదలకుండా కుర్చొ నేను నీకు కధ చెబుతాను.
హ.... అనాట్టు  తల ఊపడు. .....


అనగానగ బెజ్జలదేశాని మార్జాల రాజు పరిపాలిస్తున్నాడు కాని
ముాషిక  ప్రజలేకువా. మార్జాల రాజు ముాషిక
ప్రజలను చాలా భాధలు పెడుతుండెవాడు.

మా కొసం మాదేవుడు వస్తాడాని ముాషిక  జనం వేచి చుాస్తునారు.

సంవత్సరం గడిచింది వినాయక చవితి రానే వచ్చింది.

ముాషిక  ప్రజల కొసం గణపతి బప్పా ఎలుక వాహనం పై
 వచ్చి మార్జాల రాజు పై దండెత్తి
ముాషిక  ప్రజలు చూస్తుండగా మార్జాల రాజు పై యుద్ధం చేస్తూంటే. .
...ప్రజలు వక్రతుండ  వన్స్ మెుర్
వక్రతుండ వన్స్ మెుర్
కేకలు వేస్తూనారు.

యుద్ధంలొ గణపతి బప్పా మార్జాలరాజును ఒడించాడు.

అప్పుడి నుండి పతి సంవత్సరం బెజ్జలదేశా
ప్రజలు వినాయక చవితి ఘనంగా  జరుపుకొంటునారు
అని చెప్పాగ.

గణేష్. ...మామతొ. మామ కధ వన్స్ మెుర్ గా వుంది.

వక్రతుండ వన్స్ మెుర్ అని అరుస్తూండగానే ఇల్లు వచ్చింది.






11, సెప్టెంబర్ 2018, మంగళవారం

ఒకనొక సాయంత్రం. *



అప్పుడే పుట్టిన పక్షి పిల్ల అరుపులు 

ఆ చొట్టుకు వచ్చిన చలని గాలికి చెట్టు విరుపులు 

కాయలతొ వంగిన కొమ్మ లు

గడ్డి లో గొల్లభామల గోల లు

రంగు రంగుల పశువులు

 దుారంత వినపడే వరి నాట్ల పాటలు 

కందిచేను వయ్యారాలు
పెసర చేను పిలుపులు 

 ఒకనొక సాయంత్రం పల్లె తల్లి చెంత. ....

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...