28, జనవరి 2019, సోమవారం

ఒరేయ్. .నా మిత్రమా. .



నేను అనుకుంట ఒరేయ్ అని పిలవాలని

 మొదటిసారి నిన్ను చూసినా పిలుపు

ఒరేయ్. ..రా ల పెరిగిన బంధం
బలపడేన ఇప్పటికీ

నేను ఎరిగిన రోజే తెలిసింది
నీ పేరే ఫలాన అని

నిను విడినా రోజే తెలిసింది
ఈపిలుపే చివరిదాని

ఇప్పటికీ అనిపిస్తుంది
ఒంటరిగా వున్నప్పుడు
ఒరేయ్ అని పిలవాలని

మిత్రమా ఒరేయ్ తొ బంధమా. ..


********
వెలుమజాల నర్సింహ

9, జనవరి 2019, బుధవారం

అగ్నిశిఖ

ఆనందం కొందరిదే
ఆకలి చావులేందరివొ

భవనాలొ కొందరే
బస్తీ గుడిసెలలో ఎందరొ

చెరిగేన గీత మరేన తలరాత
చెక్కెన శిల్పని  అగ్నిశిఖ

******
ప్రసవ వేదన పడనిదే
ఫలితం విలువ తెలువదు

నిన్న రేపు తెలుపున
నీ భవిష్యత్తు
ఎదైనా ఇప్పుడె ఇక్కడే

మరణం మర్చేన నీబాట
మధనంలోంచి పుట్టెన అగ్నిశిఖ
*******

31, డిసెంబర్ 2018, సోమవారం

నుాతన సంవత్సరం@ 2019"



కాలగర్భంలో మరో సంవత్సరం
కానుకగా కొత్త సంవత్సరం

కాలంతోపాటు పయనం
కాదనా ఆగదు నీకోసం

కొత్త సంవత్సరం కొత్త కోరికలు
కొదవా లేని ఆశల తీరం

నడుస్తున్న కాలం మొబైల్ శకం
నడవదు నీకాలం ఆది చేతిలో లేనిదే

సామాజిక మాద్యమాల  జోరు
సాగేన రొజు వాటిలో హొరు

లెక్కకు తగ్గేనా  ఒక్క సంవత్సరం

మళ్ళీ మళ్లీ వచ్చేన కొత్త సంవత్సరం

మనీ, మనిషి కి వచ్చేన రెక్కలు

కాకుంటే మెదటి రోజే సుమా

ప్రపంచం మనుషులు వెతుకుతారు కొద్ది నిముషాలు
అదే హ్యాపీ న్యూఇయర్

✍నర్సింహ వెలమజాల

27, డిసెంబర్ 2018, గురువారం

జీవనయానం



గమ్యం తెలియాని పయనం
గతుకుల బతుకుల జీవనం
అయేమయంల చదువు
పయనం తెలియదు జీవనయానం

చిటపట చినుకుల వర్షం
చింతలతొ కుాడిన మనసు
నిద్రకు మించిన సుఖం
నిడివి  కల జీవనయానం

25, డిసెంబర్ 2018, మంగళవారం

ప్రభువే నీవని తలచి ("Jesus Christ ")



 ప్రభువే నీవని తలచి ప్రపంచమే
పండగ జరిపేన యేసేయా

యేసేయా మాదేవుడని
మానవులు కొలిచేన

కొలిచేన గుండెలో నిండుగా శిలువతొ

శిలువతొ శీరం పై ముల్ల కీరటంతొ

ముల్ల కీరటంతొ శాంతికి మార్గం చుాపుతు యేసేయా

యేసేయా మాదేవుడని కొలిచేదమా అను నిత్యం

24, డిసెంబర్ 2018, సోమవారం

జీవితం ×జీతం



జీవిగా పుట్టిన మనిషి , జీవితంలో మనుగడ కోసం జీతంతో సతమతమవుతు 'నిష"కు బానిసై జీవంలేని మనిషిగా 'మనీ కోసం ఆరాటమే జీవితం.

..నర్సింహ వెలుమజాల.

22, డిసెంబర్ 2018, శనివారం

మరణం తెలిపే నిమిషం


           
                                                                   

మరణం తెలిపే నిమిషం
మరో జన్మకు కానుక కాదా

 ఓటమి    తెలిపేనిమిషం
మరో అనుభవాన్నికి కానుక కాదా

మండే ఏండలే అనుకుంటే మబ్బుల 
మటున వానకు కానుక కాదా

పురిటినొప్పులమటున
పురుడుపోసుకొన
జీవే కానుక కాదా

కష్టం వెనుకా వచ్చే
ఆనందం మరో కానుక
కాదా

మరో జన్మ వుందో లేదో
తెలువని మనిషి

సంపాదన కోసం ఆరాటం మరో కానుక కాదా

నర్సింహ. వి

21, డిసెంబర్ 2018, శుక్రవారం

నీలో నీవు

నీలో లేని దాని గురించి భాధ పడడం కన్నా

 నీలో  వున్న  దానిని  అభివృద్ధి చెయ్యటం మిన్న
వెన. ....

20, డిసెంబర్ 2018, గురువారం

మనసు మాట



నాకనురెప్పల చప్పుడుతొ 
కలతచెందకు మిత్రమా 

నా వాలు చూపులు సవాళ్లుగా మారాయా 

నీను చూస్తుంటే నా కనులు ముాయను లేను 

హృదయానికి గాయం చేయ ఉదయానే గుర్తిొస్తావు 

మతిమరపు అనుకొని 
మరీ మరలా గుర్తిొస్తావు

గుండెను చీల్చే మాటల కన

గుండెలో గుడి కడుతా వుంటవా మిత్రమా 

గాయం చేసి మాయమవుతావా
మనిషిలాగ

16, డిసెంబర్ 2018, ఆదివారం

పద్యాలు

1.ఏవరిచే ఘనముగా
హాలమున్ కలమున్
చేబుని, బాల రసాల 
భాగవతంని రచించిన 
మా హాలికుల దైవ సమానుడైన 
బమ్మెర పోతనని మెుక్కద "నర్సింహ

2.

14, డిసెంబర్ 2018, శుక్రవారం

ఇల్లు ఇర్కటం ఆలి మర్కటం

తన తరపు బంధువులు 
తగ్గున మర్యాద 

పతి తరపు బంధువుల
 పాత బొంత మర్యాద

కలహాలు కలుగుట కాదే 
మెుదలు 

అతిధి దేవొభవ ఆడవారు మరిచి 

ఇల్లు ఇర్కటం ఆలి మర్కటం చేయు  తగ్గున

9, డిసెంబర్ 2018, ఆదివారం

జంబుక



 అనగానగ 'మనాస పుర రాజ్యానికి ఉగ్రా అనే సింహం రాజుగా,  జంబుక అనే నక్క మంత్రిగా రాజ్య పాలన చేస్తున్నారు

జంబుక చాలా జిత్తులమారిది రాజు ను చంపి మనాస పుర రాజ్యానికి రాజు కావాలని ఆశ.
చరక అనే  కుందేలు తన పరివారముతొ ఇదే రాజ్యంలో నివసిస్తున్నాయి.

ఒక రొజు ఉదయం పుాట చరక తన కుటుంబంతో పచ్చి గరక కోసం బయటకు వచ్చాయి. దాని గమనించిన జంబుక కుందేళ్ళలను భయ పెడతా అనుకొని చరకా..... రాజుగారు వస్తున్నారు అన్నాది దానికి భయ పడినా కుందేలు పొదలలొకి జారుకున్నాయి .
ఇది చుాసిన జంబుక నవ్వుకొని కాబోయే రాజు నేనే కాబట్టి  ఈమాత్రం భయం వుండాలి అనుకొంది.

అలా కాలం గడుస్తున్నా కొని రోజుల తరువాత అ ..ఆడవిలో వున్న జంతువులు జంబుకను చుస్తే భయపడేవి.
జంబుక వేరే జంతువులను పట్టించుకోకుండా
ఏమి జరుగుతుందో గమనించికుండ సోమరిగా వుండేది.

అది వేసవి కాలం ఎవరొ వేటగాడు ఆడవిలో ఎండు గడ్డికి మంట వేసాడు అది గమనించిన చరక తనపరివారంతొ పరుగులు పెడుతుంటే. జంబుక కుందేళ్ళు పిరికివి అనుకొని పొదలోకి పొయింది.
చుట్టూ మంటలతొ జంబుక ప్రాణం పొగొటుకుంది

నీ చుట్టూ ఏమి జరుగుతుందో గమనిస్తూ జీవించాలి లేదంటే జంబుక లాగ ప్రాణం పొగొటుకొవడం జరుగును.

వెన. ..

మౌనం శున్యం కాదు అని సమస్యలకు సమాధానం


8, డిసెంబర్ 2018, శనివారం

కవిత్వమా

  
హృదయానికి తొడిగిన అంగిల
ఉదయనే గుర్తుకొస్తొవు

రవికిరణం తాకినా  నీటి బిందువుల
నాగుండెలపై నుండి జారిపోతుంటావు

కలలతొ కాపురం మంటూ
కాసేపు వుండవు గుండెలో
గుండెలపై తన్నినా తను గుర్తుకు నీ గురించి

కవిత్వమా
కాసేపువుండి కవించు హృదయాని.

6, డిసెంబర్ 2018, గురువారం

సమాజం ఒక్క నది

సమాజం ఒక్క నది
ప్రవాహం లాంటిది ముందుకు
 ఈదుకుంటు వేలవలిసిందే లేకుంటే కొట్టుకు పొతావు

సమాజం ఒక్క నది

సమాజం ఒక్క నది
ప్రవాహం లాంటిది ముందుకు ఈదుకుంటు వేలవలిసిందే లేకుంటే కొట్టుకు పొతావు

5, డిసెంబర్ 2018, బుధవారం

అమృత కలశం"


సాలెగూడులోని సారం చుాసి 
సాగేన మానవ జీవనం 

కుమ్మరి పురుగు కడవడి చుాసి 
పొందేన కుమ్మరి కుండ 

గడుసరి పిచ్చుక గుాడును చుాసి 

గుడిసె నిర్మాణం పునాది వేసేన 

ఆది మానవుడి ఆకలి తీర్చా 
ఆకుల ఆడవుల కేగేన 

 ఐక్యత కోసం పోరాట  మనిషి 
చీమల దారిలో పయనించేన

జంతువుల ఆరుపులు కేకలు విని 
బాషకు పునాది వేసేన

కలిసుంటే కలుగవు కష్టలని 
కడలి చేపల గుంపు చేప్పేన

ప్రకృతి ఒక "మృత కలశం"
ప్రసాదించే మనుగడకు 

వెన. .దుప్పల్లి

2, డిసెంబర్ 2018, ఆదివారం

మనసు- మనసుకు

పారే నీళ్ళలాగమనసు
పరుగే దానికి తెలుసు

మంచి చెడు తెలియని వయసు.
మట్టిలో కలిసే తనువు
ఇది అంతా మట్టాని తెలుసు
అది మనసుకు మరీ మరీ తెలుసు

యవ్వనం శాశ్వతం కాదని తెలుసు

మనసుకు ఆమాటే ఆలుసు
జగమే మాయని తెలుసు
జనమే ఆవకాశవాదులని తెలుసు

29, నవంబర్ 2018, గురువారం

చెలిమికి చెల్లు

చెలిమికి చెల్లు చల్లని గాలి
చల్లని గాలి సందులోకి
 వెళ్లి

చెలిమికి  చెల్లు చెల్లుమల నీళ్ళు

చెల్లుమల నీళ్ళు చెట్లకు చెందు

చెలిమికి  చెల్లు చెట్లకు కాయ
చెట్లకు కాయ చెల్లు పండై తొడిమే

చెలిమికి చెల్లు చెమ్మకు చెమట

 చెమటకు తెలుసు కష్టం విలువ

చెలిమికి చెల్లు పగలుకు రాత్రి
రాత్రికి చెల్లు రావొయ్ చందమామ

నేటి చదువులు

పిల్లల చదువులకై తల్లిదండ్రులుపాకులాడ
ఎల్కేజీ యుకేజీ యని చెప్పా
లక్షల కొద్ది ఫీజుల్ బస్తాల కొద్ది బుక్స్ ల్
బికామ్ లో ఫీజిక్స్  అయే ్య నేటి చదువులు
చదివిన చదువుల సారము లేదయే గురువరా.

23, నవంబర్ 2018, శుక్రవారం

బుుక్కలు

నీతో వుండని మనసు కోసం
నిత్యం పోరాటం

నీలొ వుండని నీతీ కోసం
నిత్యం ఆరాటం
పిలువగ రాని పుత్రుల కోసం
బతుకుతొ చెలగాటం
కట్టివేసిన వుండని ఆశ కోసం
కొన ఊపిరి వరకు ఆరాటం
నదికి నడక నేర్పూట కోసం
నానా తంటాలు పడడం ముార్ఖత్వం
కలిసిరాలేదాని కాలం కోసం
వేచి చుాడడం అమాయకత్వం

21, నవంబర్ 2018, బుధవారం

నారాయణ:

పల్లవి:నారాయణాయాని
 పిలువగ నేను
నన్ను కాపాడగా వచ్చి తివా

కృష్ణాయాని నేను పిలువగ నిన్ను

కష్టలని తీర్చితివా

చరణం: నీ పేరుని మనసులో తలచిన వేంటనే

మనసులో తేలిక అయేనా

కన్నయ్య అని పిలువగ నేను
నాకడుపులొ ఆకలి మరిచితినా
గజేంద్రుని  ఆరుపుకు నీవు. 
...వైకుంఠ వదిలి వచ్చితివా

ముడుడగుల నేలను కొరి. ..
బలిని పాతాళానికి తొక్కితివా


చరణం: హరి అని  పిలువగ నేను

హరిచుకుపొవా నొప్పులు

పడతి అన్నయాని పిలువగ వేంటనే

పరువును కాపాడితివా

చరణం: వేంకట రమణాయాని
పిలువగ నేను
సంకటలు హరిచుకుపొవా

తనువు గాయం చేసుకున్న వెదురు

వేణుగానమై మైమరిపించునా

      :నారాయణాయాని:

Velmajala Narsimha
.......

20, నవంబర్ 2018, మంగళవారం

వేణు మాధవా


దుప్పెల్లి అనే  గ్రామములో వాసు దేవయాని కుమారులు వేణు మరియు మాధవ్.
వేణు పెద్దవాడు చాలా బద్దకస్తుడు.
ఎదైనా పని చేయమంటే ఏడుపు ముఖం పెట్టేవాడు కాని మాధవా
మృధుస్వభావి చాలా నెమ్మదాస్తుడు.

వేణు ఊరులొ జులాయ్ గా తిరిగేవాడు టివి చుస్తుా  బడికి పోతుంటే మాధవా మట్టితో బొమ్మలు చేస్తూ మట్టిలో అడుకునేవాడు. అలా బొమ్మలు చేస్తూ మంచి నైపుణ్యాన్ని సంపాదించాడు. వేణు    మాధవ్ ని   ఎప్పుడు మట్టిలో ఆటలేనా అని తిట్టేవాడు

కొని రోజుల తరువాత మాధవా పెన్సిల్ తొ బొమ్మలు వేయడం మెుదలేటాడు.

సులభంగా ఎవరి ముఖ చిత్ర మైన కొని క్షణాలలో వేయడం చేసేవాడు. వేణు టివి చూడడం మొబైల్ లొ గేమ్స్ ఆడడం చేసే వాడు.

మాధవా గోరు తొ బొమ్మలు వేయడం చాలా విచిత్రం గా వేసేవాడు. గోరు తొ బొమ్మలు వేయడం అనే విషయం ఊరులొ జనాన్నికి తెలిసింది

కంఠం దాటిన మాట ఖండంతరాలకు పాకినట్లు "

టివి వాళ్లు వచ్చి మాధవ తొ ప్రోగ్రామ్ చేయడం తొ  మాధవా చాలా పాపులర్ అయిపొయాడు.


వేణు మరియు మాధవ్ అన్నదములే కాని వేణు
ఆర్డినరి మాధవా ఎక్స్ ట్రార్డినరి గా ఎదిగారు

మనుషులు రెండు రకాలు ఆర్డినరి మరియు ఎక్స్ ట్రార్డినరి.

ఎక్స్ ట్రార్డినరి వాళ్లు క్రీయేటివ్ చేస్తూవుంటే

ఆర్డినరి వాళ్లు ఆనందిస్తుంటారు.

 పతి గుడి లో దేవుడు వున్నడొ లేడొ తెలువదు కాని పతి మనిషి లో ఒక టాలెంట్ తప్పక వుంటుంది. మాధవా లాగ దాని పదును పెట్టేవాడే ఎక్స్ ట్రార్డినరిగా తయారవుతాడు సంఘంలొ గౌరవించబడుతాడు.

Velmajala Narsimha

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...